108 అంబులెన్స్ ను ఎత్తుకెళ్లిన దొంగ.. ఏం చేద్దమనుకున్నాడో

author img

By

Published : Sep 15, 2022, 9:33 PM IST

ambulance

Ambulance Theft: ద్విచక్రవాహనాలు దొంగతనం.. కారెత్తికెళ్లిన దొంగోడు.. ఇలాంటి వార్తలను చూస్తుంటాం. కాని ఓ ప్రబుద్దుడు ఏకంగా ఓ 108 అంబులెన్స్ నే చోరీ చేశాడు. దొంగతనం వృత్తి అయినప్పుడు.. ఏ వాహనం అయితే, ఏంటీ అని అనుకున్నాడేమో... కాని, పోలీసులు అలా అనుకోరుగా..!

Ambulance Theft: రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసిన 108 అంబులెన్స్​ను మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి చోరీ చేశాడు. వాహనం దొంగతనానికి గురైందని​ గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా నల్లగొండ జిల్లా తిప్పర్తి సమీపంలో అంబులెన్స్​ ఉందని పోలీసులు గుర్తించారు. దీంతో సమీపంలోని టోల్​గేట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంబులెన్స్​ను గుర్తించిన స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. దొంగతనం చేసిన వ్యక్తితో పాటు అంబులెన్స్ డ్రైవర్, సిబ్బందిపైనా కేసులు నమోదు చేశారు.

ఇవీ చదవండి: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి..

టోల్​బూత్ వద్ద ఇద్దరు మహిళల గొడవ.. ఒకరిపై ఒకరు పడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.