ETV Bharat / city

108 STAFF: ఆగిపోయిన పసి గుండెను.. మళ్లీ బతికించారు!

author img

By

Published : Jul 28, 2021, 12:56 PM IST

peddapalli
ఆగి పోయిన పసి గుండెను బతికించారు

పరిస్థితి విషమించి ఆస్పత్రికి వెళ్తుండగా.. దారి మధ్యలో ఓ పసి హృదయం ఆగిపోయింది. అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది.. పీసీఆర్ విధానంలో​మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు. ఆ బిడ్డకు ప్రాణం పోశారు.

చిన్నారి ప్రాణాన్ని కాపాడిన 108 సిబ్బంది

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. పుట్టినప్పటి నుంచి బాబు ఆరోగ్యం సరిగా లేదు. దీంతో కరీంనగర్ ​సివిల్​ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో వరంగల్​ ఎంజీఎంకు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు.

అక్కడి నుంచి తీసుకెళ్తున్న క్రమంలో చెంజర్ల మండలం ఖాదర్​ గూడెం వద్ద బాబు గుండె ఆగిపోయింది. వెంటనే 108 సిబ్బంది వెంకట్ అప్రమత్తమయ్యారు.​ పీసీఆర్​ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేసి ప్రాణం పోశారు.

సివిల్​ ఆస్పత్రిలో బాబుకు చికిత్స అందిస్తూ ఉండగా.. పరిస్థితి విషమంగా ఉందని వరంగల్​ ఎంజీఎంకు తీసుకెళ్లాలని ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి వెంటనే బయలుదేరాం. దారిలో బాబుకు హృదయ స్పందన ఆగిపోయింది. అప్పటికప్పుడు 108 వైద్య సిబ్బందితో మాట్లాడి పీసీఆర్​ చేశాం. మళ్లీ గుండె కొట్టుకుంది. అవసరమైన చికిత్స అందించి వెంటనే ఎంజీఎంకు తీసుకెళ్లాము.

-వెంకట్, 108 సిబ్బంది

అనంతరం వరంగల్​ ఎంజీఎంకు తీసుకెళ్లారు. తమ కుమారుడు 108 సిబ్బంది వల్లే బతికాడని.. శిశువు తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బాబు చికిత్స పొందుతున్నాడని.. ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి:

Mother Story: బిడ్డ మనసును.. అమ్మకాక మరెవరు అర్థం చేసుకుంటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.