ETV Bharat / city

రాజధాని అంశంపై సీఎంకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి అథవాలే

author img

By

Published : Sep 24, 2020, 11:44 AM IST

రాజధాని అంశంపై సీఎం జగన్ కు లేఖ రాయనున్నట్లు కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. అమరావతి మహిళా ఐకాస నేతలు మంత్రిని కలిసి అమరావతి అంశం వివరించారు. రాజధానిగా అమరావతికి తన మద్దతు ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Amaravathi women jac leaders met central minister ramdas athavale
Amaravathi women jac leaders met central minister ramdas athavale

కేంద్రమంత్రి రాందాస్ అథవాలేను అమరావతి మహిళా ఐకాస నేతలు కలిశారు. అమరావతి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును మహిళా నేతలు, రైతులు మంత్రికి వివరించారు. రాజధాని విషయంలో రైతుల డిమాండ్ న్యాయమైందని మంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు.

అమరావతి అంశాన్ని మహిళా నేతలు, రైతులు వివరించినట్లు తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగిం తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రాజధాని అంశంపై సీఎం జగన్‌కు లేఖ రాయనున్నట్లు కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

దిల్లీలో పలువురు ఎంపీలను కలిసిన అమరావతి మహిళా జేఏసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.