ETV Bharat / city

వైకాపా ఎంపీ విజయసాయిపై నాగబాబు సెటైర్లు

author img

By

Published : Apr 23, 2020, 12:41 PM IST

Updated : Apr 23, 2020, 1:59 PM IST

'మాస్క్ గొంతుకు కాదు.. నోటికి పెట్టుకోవాలంటూ' వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ సినీ నటుడు నాగబాబు ట్విటర్​లో చురకలంటించారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు.

actor-nagababu
actor-nagababu

actor nagababu satiers on ycp mp vijayasai
నాగబాబు ట్వీట్

జనసేన నేత నాగబాబు.. వైకాపా ఎంపీ విజయసాయిపై సెటైర్లు విసిరారు. 'విజయసాయిరెడ్డి... మాస్క్ గొంతుకు కాదు, నోటికి పెట్టుకోండి' అంటూ ఓ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పొస్టు చేశారు. 'మీ సెక్యూరిటీ కూడా మాస్క్​లు ధరించారు. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి' అంటూ సూచన చేశారు. భవిష్యత్తులో మీతో ఫైట్ చేయాలి కదా అంటూ చురకలు అంటించారు. విజయసాయికి మాస్క్​ ఉన్నా జనం గుర్తుపడతారని... దానికి తాను గ్యారెంటీ ఇస్తానంటూ నాగబాబు తనదైన స్టైల్​లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదీ చదవండి:

'చావుకీ.. బతుక్కీ మధ్య నలిగిపోతున్నాం'

Last Updated : Apr 23, 2020, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.