TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : May 9, 2022, 8:57 PM IST

9pm Top news

.

  • ప్రేమించిన యువతిని తుపాకీతో కాల్చి.. ఆపై తానూ కాల్చుకొని..
    నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపి హత్యచేశాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రతి నియోజకవర్గ కేంద్రంలో.. ఎంఐజీ లే-అవుట్‌ ఉండాలి: సీఎం జగన్
    రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. రాజధానిలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జగన్​కు అర్థమైంది.. వైకాపాకు అవే చివరి ఎన్నికలు: చంద్రబాబు
    ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజలంతా కలిసి రావాలని కాకినాడలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి.. పొత్తులపై మాట్లాడినట్లు చిత్రీకరించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పిల్లిలా భయంతో అందరికాళ్లూ పట్టుకున్న జగన్‌ను సింహంగా పిలవటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ విషయం... పవన్ కల్యాణ్​​నే అడగాలి : సోము వీర్రాజు
    పొత్తుల విషయంలో స్పష్టంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. అయితే.. తెదేపా, జనసేన కలుస్తాయా లేదా? అనేది మాత్రం పవన్‌నే అడగాలని చెప్పారు. కుటుంబ పార్టీలతో భాజపా పొత్తు పెట్టుకోదని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశద్రోహ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం..
    దేశ ద్రోహ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశద్రోహ చట్టాన్ని పున‌ఃపరిశీలించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పార్టీ చాలా చేసింది.. రుణం తీర్చుకునే సమయమిదే: సోనియా
    కాంగ్రెస్ బలోపేతానికి ఉద్దేశించిన చింతన్ శివిర్ కార్యక్రమం ఏర్పాట్లపై దిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశమైంది. ఈ భేటీకి అధ్యక్షత వహించిన పార్టీ ప్రెసిడెంట్ సోనియా గాంధీ.. అగ్ర నేతలకు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీలంక ప్రధాని రాజీనామా.. రంగంలోకి సైన్యం
    శ్రీలంక ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహింద రాజపక్స వెనక్కితగ్గారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. కొలంబోలో సైన్యాన్ని రంగంలోకి దించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. జీవితకాల కనిష్ఠానికి రూపాయి
    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, కీలక సంస్థల ఫలితాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నవ్వులు పూయిస్తున్న 'ఎఫ్​ 3' ఫన్​ ట్రైలర్​
    వెంకటేశ్, వరణ్​ తేజ్​ కలిసి నటించిన 'ఎఫ్ 3' ఫన్​ ట్రైలర్​ వచ్చేసింది.​ ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. దాన్ని మీరు చూసేయండి..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ధోనీ సూపర్​ రికార్డ్​.. ఐపీఎల్​ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ..
    దిల్లీతో జరిగిన మ్యాచ్​లో 91 పరుగులు భారీ తేడాతో సీఎస్కే గెలిచింది. అయితే ఈ మ్యాచ్​లో చెన్నై జట్టు సహా కెప్టెన్​ ధోనీ ఓ అరుదైన రికార్డు సాధించారు. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.