ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM

author img

By

Published : May 6, 2021, 9:00 AM IST

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM

.

  • అత్యధిక క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

దేశంలో గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల్లో రాష్ట్రం నుంచి ఏడు జిల్లాలు ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ బుధవారం దిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా 'అదానీ'కి

గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను కూడా అదానీకి విక్రయించనున్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.645.10 కోట్లు సమకూరనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కరోనాకు చికిత్స : లాయర్లకు నగదు రహిత వైద్యానికి ' రక్ష ' ఒకే'

ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ న్యాయవాదులకు కరోనాకు సంబంధించి నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఏపీ బార్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసింది. ఇందుకు ' రక్ష ' థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ హామీ ఇచ్చినట్లు ఛైర్మన్ గంటా రామారావు స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ డెస్కులకు ఫోన్​ చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్​

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 44,639 పాఠశాలలను దశల వారీగా ఈ బోర్డుకు అనుసంధానిస్తామని వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా!

కరోనా తగ్గట్లేదు సరికదా.. రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. అడుగడుగునా మహమ్మారి పొంచి ఉన్న ఈ సమయంలో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సోకుతూనే ఉంది. ఇప్పటికే పాజిటివిటీ రేటు 24.80%కి చేరింది. బుధవారం ఒక్కరోజే 3,82,315 మంది వైరస్‌ బారిన పడగా.. 3,780 మంది వైరస్‌కు బలయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'పూనావాలాకు జడ్ ప్లస్ భద్రత కల్పించండి'

సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలాకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలంటూ బాంబే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు ఓ న్యాయవాది. పూనావాలాకు ఎదురైన బెదిరింపులపై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. టీకా తయారీదారులు అభద్రతా భావంలో ఉంటే.. ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'తూర్పు భారతం వైపుగా కరోనా కదలికలు'

అసోం, బంగాల్​, ఒడిశా, బిహార్​, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లో కరోనా కోరలు చాస్తూ వెళ్తోందని కేంద్రం తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య అధికంగా నమోదవుతూ ఉండటమే ఇందుకు సాక్ష్యమని పేర్కొంది. మరోవైపు.. దేశంలోని 12 జిల్లాల్లో కరోనా కేసుల పెరుగుదల భారీగా కొనసాగుతోందని వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ప్రభుత్వ ఏర్పాటులో నెతన్యాహూ మళ్లీ విఫలం

ఇజ్రాయెల్​ దేశాధ్యక్షుడు విధించిన గడువులోగా.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మళ్లీ విఫలమయ్యారు. దీంతో.. ప్రతిపక్ష నేత యయిర్ లపిడను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బయోబుడగలోకి కరోనా.. అసలేం జరిగింది?

కరోనా మహమ్మారి ఐపీఎల్​ను వాయిదా వేసేలా చేసింది. అయితే అంతటి కఠిన బయోబబుల్​లోకి వైరస్ ఎలా ప్రవేశించిందన్నది అర్థం కాని విషయం. దీనికి ప్రధాన కారణం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బబుల్‌ దాటి బయటికి వెళ్లడం, తిరిగి వచ్చాక యథావిధిగా జట్టును కలవడమే అని సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా తీవ్రతపై కోలీవుడ్​ ప్రముఖులు ఏమన్నారంటే!

కరోనా తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరూ వాక్సిన్​ వేయించుకోవాలని ప్రజలకు కోలీవుడ్​ ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. కొవిడ్​పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొంతమంది తారలు సూచనలు చేసిన వీడియోను మద్రాస్​ రోటరీ క్లబ్​ విడుదల చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.