ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jun 16, 2022, 4:53 PM IST

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

..

  • తెదేపా నేత గౌతు శిరీషకు... సీఐడీ నోటీసుపై హైకోర్టు స్టే
    తెదేపా నేత గౌతు శిరీషకు సీఐడీ ఇచ్చిన నోటీసుపై హైకోర్టు స్టే విధించింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CM REVIEW: విద్యాశాఖపై ముగిసిన జగన్ సమీక్ష.. బైజూస్​తో ఒప్పందం
    CM REVIEW: విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష ముగిసింది. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్​తో ఒప్పందం చేసుకున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • DAMAGED ROADS: 102 కిలోమీటర్ల పరిధిలో300 గుంతలు..
    DAMAGED ROADS: విజయనగరం.. పురపాలక సంఘం నుంచి నగరపాలక సంస్థగా ఎదిగినా.. సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. నగరంలోని ప్రధాన రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయి. అడుగడుగునా గుంతలతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లాలన్నా.. రైతుబజారుకు వెళ్లి కూరగాయలు తెచ్చుకోవాలన్నా జనం భయపడే పరిస్థితి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Renuka Chowdhury: 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్​కు వచ్చి మరీ కొడతా'
    Renuka Chowdhury warns police : రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ తలపెట్టిన ఆందోళన రణరంగంలా మారింది. రాజ్​భవన్ ముట్టడించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. మాజీ మంత్రి రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆమె.. పోలీస్ కాలర్​ను పట్టుకుని.. 'నన్నే పట్టుకుంటావా.. స్టేషన్​కు వచ్చి మరీ కొడతా' అంటూ రేణుకా చౌదరి పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జస్టిస్​ ఎంఆర్​ షాకు తీవ్ర అస్వస్థత- స్పెషల్ ఫ్లైట్​లో దిల్లీకి...
    సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎంఆర్​ షా తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం హిమాచల్​ ప్రదేశ్​ నుంచి దిల్లీకి వాయుమార్గం ద్వారా తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బంగారానికి దారి చూపిన ఎలుక.. ఆ ఫ్యామిలీ ఫుల్​ ఖుష్!
    లక్షలు విలువైన బంగారు ఆభరణాలు పట్టుకునేందుకు ఓ ఎలుక పోలీసులకు దారి చూపింది. చెత్తకుప్పలోని 100 గ్రాముల బంగారాన్ని పట్టించింది. ఈ సంఘటన మహారాష్ట్ర, ముంబయిలోని దిండోశీ ప్రాంతంలో జరిగింది. చెత్తకుప్పలో అంత బంగారం ఎక్కడిది? ఆ ఎలుక చేసిన సాయం ఏమిటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.234, డీజిల్​ రూ.263
    ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​లో పెట్రోల్​ ధరలు భగ్గుమంటున్నాయి. ఇరవై రోజుల క్రితమే లీటర్​ పెట్రోల్​పై రూ.60 పెంచిన ప్రభుత్వం మరోసారి రూ.24 వడ్డించింది. దీంతో లీటర్​ పెట్రోల్​ రూ.234కు చేరింది. రాయితీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దలాల్​ స్ట్రీట్​పై ఫెడ్​ దెబ్బ- సెన్సెక్స్​ 1000 మైనస్​
    అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, అమెరికా ఫెడరల్​ రిజర్వ్​​ వడ్డీ రేట్ల పెంపు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశీయంగా కరోనా కేసులు పెరగడమూ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించేందుకు కారణమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​కు షాక్​! ఇంగ్లాండ్​ పర్యటనకు స్టార్ ఓపెనర్ దూరం.. చికిత్స కోసం జర్మనీకి
    కీలకమైన ఇంగ్లాండ్​ పర్యటనకు ముందు టీమ్​ఇండియాకు గట్టి షాక్​ తగిలింది! స్టార్​ ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ ఇంగ్లాండ్ పర్యటనకు కూడా దూరం కానున్నాడు. గాయం కారణంగా ఇప్పటికే సఫారీలతో సిరీస్​కు దూరమైన అతడు​.. చికిత్స కోసం జర్మనీ వెళ్లనున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రానా-సాయి పల్లవి 'విరాటపర్వం'.. ఈ విషయాలు తెలుసా?
    రానా, సాయిపల్లవి నటించిన 'విరాటపర్వం' శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టికెట్‌ ధరల వివరాలు తెలియజేసింది. ఆ వివరాలతో పాటు సినిమా గురించి మరిన్ని విశేషాలు మీకోసం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.