ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Aug 28, 2021, 2:58 PM IST

ప్రధాన వార్తలు @ 3 PM

3pm
3pm

  • జనసంద్రంగా కేంద్రాలు

మార్కాపురంలో గత నాలుగు రోజులుగా బయోమెట్రిక్ కోసం చిన్నారులతో వారి కుటుంబ సభ్యులు వచ్చి వెళుతున్నారు. అయినా పని కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏదోఒక పరిష్కారం చేయండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అధికారుల నిర్లక్ష్యం

నాడు-నేడులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలన్నీ మారుస్తామని ప్రభుత్వ పెద్దలు గర్వంగా చెబుతున్నా.. పలుచోట్ల విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. అనేకచోట్ల చిన్నపాటి వర్షాలకే పాఠశాల ప్రాంగణంలో నీళ్లు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఆ నీళ్లలోనే నడుచుకుంటూ తరగతులకు హాజరుకావాల్సి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కార్యాలయం ప్రారంభం

కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో లోకాయుక్త కార్యాలయం ప్రారంభమైంది. లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి..కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అన్నను చంపిన తమ్ముడు

కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలు ఓ ప్రాణం పోయేందుకు కారణమయ్యాయి. కలిసిమెలిసి ఉండాల్సిన అన్నదమ్ములే తరచూ గొడవలు పడుతూ.. చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున సోదరుల మధ్య జరిగిన గొడవలో.. తమ్ముడు అన్నను గడ్డపారతో పొడిచి చంపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిందితులు అరెస్ట్​

మైసూరులో కళాశాల విద్యార్థిని గ్యాంగ్​ రేప్​ చేసిన వారిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వరించిన అదృష్టం

ఓ రైతుకు కాసుల పంట పండింది. రెండేళ్ల శ్రమకు ఫలితం దక్కింది. తన వ్యవసాయ భూమిలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది(farmer found diamond). మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో జరిగింది ఈ సంఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఐసిస్​-కే'లో 14 మంది

కాబుల్​ విమానాశ్రయం వద్ద దాడితో(Kabul airport blast) సర్వత్రా చర్చనీయాంశమైంది ఐసిస్​-కే ఉగ్రసంస్థ(ISKP terrorist group). మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఐసిస్​-కే ఉగ్ర ముఠాలో 14 మంది కేరళకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. జైళ్లలో ఉన్నవారందరినీ తాలిబన్లు ఇటీవలే విడుదల చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పంజ్​షేర్'లో నిశ్శబ్దం

తాలిబన్లపై(Afhgan Taliban) తుపాకులతో గర్జించిన పంజ్​షేర్​ లోయలో(Panjshir Valley) ఇప్పుడు శాంతియుత వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి అక్కడ ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. అయితే ఇది తుపానుకు ముందు ఉండే ప్రశాంతతా? లేక శాంతికి సంకేతమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యువీకి హైకోర్టు హెచ్చరికలు

మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్ (Yuvraj Singh), తనపై పెట్టిన కేసులో సహకరించకుంటే అతడిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని పంజాబ్-హరియాణా న్యాయస్థానం హెచ్చరించింది. గతంలో ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ గతేడాది యువీపై సామాజిక కార్యకర్త రజత్​ కల్సన్ కేసు పెట్టారు. ​పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రిలీజ్​ ఎప్పుడంటే​..

'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్'​ విడుదల తేదీని (most eligible bachelor release date) చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు హీరో విశాల్​ తన కొత్త చిత్రంపై అప్​డేట్​ ఇచ్చారు. థియేటర్లలో విడుదలై మంచి టాక్​ సంపాదించిన తిమ్మరుసు, ఎస్​ఆర్​ కల్యాణ మండపం చిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.