ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Oct 14, 2022, 3:03 PM IST

..

3PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 3PM

  • నిడదవోలు గణేష్‌ సెంటర్‌లో ఉద్రిక్తత
    నిడదవోలు గణేష్‌ సెంటర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిడదవోలు చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్రను అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నించింది. స్థానిక కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గణేష్‌ సెంటర్లో వైకాపా శ్రేణులు భారీగా మోహరించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 33వ రోజు రైతుల పాదయాత్ర... నిడదవోలులో వైకాపా శ్రేణుల మోహరింపు
    Padayatra: 33వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర... తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. వైకాపా శ్రేణులు అడుగడుగునా అడ్డుకుంటున్నా.. రైతులు లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. రాజమహేంద్రవరం రోడ్ కమ్‌ రైలు వంతెన మీదగా పాదయాత్ర కొనసాగాల్సి ఉండగా ఆ వంతెనను వారంపాటు మూసివేస్తున్నట్లు అధికారులు తెలపడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నిడదవోలులో రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వైకాపా శ్రేణులు భారీగా మోహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • "బిడ్డను అమ్మేసి... సొమ్ము పంచుకుని విడిపోదాం"
    ఈ ప్రపంచంలో తల్లిదండ్రులం కాలేకపోతున్నామని బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు. తాము పస్తులుండి పిల్లలను పోషించుకునే వారూ ఉన్నారు. అమ్మ, నాన్న అని పిలుపించుకునే వరం కావాలని చెట్టు, పుట్టా తిరుగుతూ ఆరాటపడేవారు ఇంకెందరో. కానీ కొందరికి ఆ వరం లభించినా డబ్బుకు ఆశపడి బిడ్డలను అంగట్లో అమ్మకానికి పెట్టి అమానవీయతను చాటుతున్నారు. అమ్మ, నాన్న అనే పదాలకే మాయని మచ్చగా నిలుస్తున్నారు. తాజాగా ఓ జంట ఇలాగే చేసింది. పేగు బంధం కూడా మార్కెట్‌ సరకుగా మార్చారు. కన్నబిడ్డను అమ్మేసి, వచ్చిన డబ్బును పంచుకుని, తమ బంధాన్ని తెంచుకుందామనుకున్నారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • World Egg day: గుడ్డుతో అందానికీ ఆరోగ్యానికి అండ
    Protect beauty: శరీరానికి పోషకాలన్నీ అందాలి.. బరువు మాత్రం పెరగొద్దు.. ఇదేగా మనం కోరుకునేది. అయితే గుడ్డును ఎంచుకోమంటున్నారు నిపుణులు. పవర్‌ప్యాక్డ్‌ ఫుడ్‌గా చెప్పే ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందంటున్నారు..
  • ఏడాది తర్వాత ఏకమైన తల్లీబిడ్డలు.. ఇది ఓ చిన్నారి చిరుత కథ!
    ఏడాది క్రితం వేరైన తల్లీబిడ్డలు ఏకమయ్యారు. ఇది మనుషుల కథ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇది ఓ చిరుత కథ. వేరైన ఆ తల్లి బిడ్డలు మళ్లీ ఏలా కలుసుకున్నారో తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం
    తన పొలంలో పండిన మొదటి పంటను హిందూ మఠానికి దానం చేశాడు కర్ణాటకలోని ఓ ముస్లిం యువకుడు. కులమతాలకతీతంగా ఆలోచించి 1600 కిలోల సజ్జలను మఠానికి వెళ్లి అందజేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కమల్ నుంచి రజనీ దాకా ఫిల్మ్ ఫేర్ కింగ్స్ వీరే
    జాతీయ అవార్డుల తర్వాత సినీ నటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేవి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కోలీవుడ్​లో వీటిని ఎవరు ఎన్నిసార్లు సాధించారో చూద్దామా పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • T20 worldcup: అన్ని లక్షల టికెట్లు అమ్ముడైపోయాయా?
    ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లను పెద్దసంఖ్యలో ప్రేక్షకులు స్టేడియంలో వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయని నిర్వాహకులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ సీరియల్​ భామ గుర్తుందా.. వయసు పెరిగినా గ్లామర్ అస్సలు​ తగ్గలే
    ఈటీవీలో ప్రసారమైన 'పద్మవ్యూహం' సీరియల్​తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అష్మిత కర్ణని. తెలుగులో దాదాపు 15 సీరియల్స్​కు పైగా నటించింది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యాక్టింగ్​కు కాస్త దూరంగా ఉన్నా సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటోంది. యూట్యూబ్​ ఛాన్​ల్​తో ఆడియెన్స్​ను అలరిస్తోంది. ఓ సారి ఈమె ఫొటోషూట్​పై ఓ లుక్కేద్దాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.