ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Jul 16, 2022, 2:59 PM IST

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

..

  • గోదావరి ఉగ్రరూపానికి విలవిల్లాడుతున్న లంక గ్రామాలు
    Godavari: రికార్డు స్థాయిలో వరద నీరు చేరడంతో గోదావరి ఉగ్రరూపానికి.. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల విలవిల్లాడుతున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా లంక ప్రజలు నిత్యవసరాలు కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లగా అడుగుతున్నా.. శంకుస్థాపనకే పరిమిత మవ్వటంతో.. మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టాలపైన ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భద్రాద్రిలో గోదావరి మహోగ్రరూపం.. శాంతించాలని మంత్రి పూజలు..
    Bhadrachalam floods: గోదావరి మహోగ్ర రూపానికి తెలంగాణలోని భద్రాద్రి వణికిపోతోంది. గంటగంటకూ నీటి మట్టం పెరిగిపోతూ.. ప్రమాదకరంగా మారిపోయింది. గోదారమ్మ శాంతించాలని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే 95 గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలంలో చాలా వరకు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Pawan kalyan: ఉమ్మడి తూర్పుగోదావరిలో పవన్‌ కౌలు రైతు భరోసా యాత్ర
    Pawan kalyan: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Floods: గోదావరి మహోగ్రరూపం..అల్లాడిపోతున్న జనం
    Floods: ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ జలమయమవ్వటంతో.. ప్రజల ఇబ్బందులకు గురయ్యారు. గోదావరి ఉగ్రరూపాన్ని చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా మరికొన్నింటిని ముంపు ముప్పు వెంటాడుతోంది. ఎగువన వర్షాలు, వరద ప్రవాహంతో జనాలు అల్లాడిపోతున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిి మట్టం గంటగంటకూ పెరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళా కానిస్టేబుల్​పై ఇన్​స్పెక్టర్​ అత్యాచారం.. పాఠశాలలో బాలికలను..
    మహిళా కానిస్టేబుల్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పోలీస్​ ఇన్​స్పెక్టర్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు యూపీలోని హాపుడ్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికల యూనిఫాంను విప్పించారు ఉపాధ్యాయులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మోదీపై అహ్మద్​ పటేల్​ కుట్ర.. తీస్తా అందులో భాగమే: సిట్​
    గుజరాత్​లో భాజపా ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు, అప్పటి సీఎం నరేంద్రమోదీపై దివంగత కాంగ్రెస్​ నేత అహ్మద్​ పటేల్​ కుట్ర పన్నారని సిట్​ వెల్లడించింది. ఇందులో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్​ భాగమయ్యారని పేర్కొంది. ఈ మేరకు సెషన్స్​ కోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 21 వాహనాలు పరస్పరం ఢీ.. ఆరుగురు దుర్మరణం.. కి.మీ. మేర ట్రాఫిక్​జామ్​
    అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధూళి తుపాను కారణంగా మోంటానాలోని ఇంటర్‌స్టేట్‌ 90 ప్రాంతంలో 21 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా..
    Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫైనల్లో పీవీ సింధు.. జపాన్​ షట్లర్​ను చిత్తుచిత్తుగా ఓడించి..
    Sindhu Singapore Open: భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సింగపూర్​ బ్యాడ్మింటన్​ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టి.. మరో టైటిల్​పై కన్నేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మెగాస్టార్​ చిరు సర్​ప్రైజ్​.. ఆమిర్​ 'లాల్​సింగ్​ చద్ధా'లో..
    Chiranjeevi Lalsingh chaddha: బాలీవుడ్​ స్టార్​ హీరో​ ఆమిర్​ఖాన్​ కథానాయకుడిగా నటించిన 'లాల్​ సింగ్​ చద్ధా' గురించి మెగాస్టార్ చిరంజీవి ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర తెలుగు వెర్షన్​ తన సమర్పణలో విడుదల కానున్నట్లు తెలిపారు. అలాగే ఇటీవలే తన ఇంట్లో ఎక్స్‌క్లూజివ్‌ ప్రీమియర్ షో విజువల్స్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.