ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Jul 5, 2022, 3:02 PM IST

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

..

  • పేదరికం నుంచి బయటపడాలంటే.. చదువు అవసరం: సీఎం జగన్​
    రాష్ట్రంలో పేదరికమనే సంకెళ్లు తెంచుకోవాలనే ఉద్దేశంతోనే విద్యారంగంపై ఎక్కువ ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మూడో విడత జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పేదరికం నుంచి బయటపడాలంటే చదువు అవసరం అని స్ఫష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అద్దె చెల్లింపుల్లో ప్రభుత్వం జాప్యం.. అంగన్వాడీ కార్యకర్తల అవస్థలు
    ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే ప్రభుత్వం ఊరుకుంటుందా?.. ఫ్యూజు పీకేస్తుంది.! పన్నులు చెల్లించడం ఆలస్యమైతే గమ్మునుంటుందా..? నోటీసుల మీద నోటీసులు పంపుతుంది!. కానీ అంగన్వాడీలకు మాత్రం ప్రభుత్వం అద్దెలు బోలెడు బకాయిలు పెట్టింది. ఒకట్రెండు కాదు.. ఏకంగా మార్చి నుంచి అంగన్వాడీలకు అద్దె చెల్లించలేదు. పిల్లలకు పోషకాహార బిల్లులూ సమయానికి చెల్లించడంలేదు. ఇలాగైతే నిర్వహణ ఎలాగని వాపోతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • FIRE ACCIDENT: జీఎల్‌ఆర్‌ వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం.. కోటి రూపాయల మేర ఆస్తి నష్టం
    FIRE ACCIDENT: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని జీఎల్ఆర్ షాపింగ్​మాల్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో దుకాణంలో ఉన్న వస్త్రాలు, ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • NON VEG: మాంసం ప్రియులు కాస్త జాగత్త్ర.. కుళ్లిన మాంసం అమ్ముతున్నారంటా..
    NON VEG: సాధారణంగా మాంసం అంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు మటన్​, చికెన్​, చేపల దుకాణాల దగ్గర జనం బారులు తీరుతారు. అదే అదనుగా చాలా మంది వ్యాపారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. తాజాగా పలు చిన్నహోటళ్లతో పాటు, పలు మాంసం దుకాణదారులకు సరఫరా చేసేందుకు దాచి ఉంచిన కుళ్లిపోయిన మాంసాన్ని నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి పట్టుకున్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గాల్లో ఉండగా సమస్య.. హడావుడిగా కరాచీకి స్పైస్​జెట్​ ఫ్లైట్.. ఏమైందంటే...
    Indian plane emergency landing in Karachi: దిల్లీ నుంచి దుబాయి వెళ్తున్న స్పైస్​జెట్ విమాన ప్రయాణికులకు అనూహ్య అనుభవం ఎదురైంది. వారి విమానం పాకిస్థాన్​లోని కరాచీలో ల్యాండ్ అయింది. వారంతా అక్కడే కొన్ని గంటలపాటు గడపాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకంటే... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఖైదీలంతా విడుదల!
    జైళ్లలో సత్ప్రవర్తన కనబరుస్తున్న ఖైదీలను విడుదల చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా అనేక మందికి కారాగారవాసం నుంచి విముక్తి కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి.. రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వివో కంపెనీ'పై ఈడీ దాడులు.. 44ప్రాంతాల్లో సోదాలు
    ED raids Vivo: మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా వివో సహా పలు చైనా కంపెనీలపై ఈడీ దాడులు చేపట్టింది. దేశంలోని 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..
    Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.54,000గా ఉండగా.. కిలో వెండి ధర రూ.60,130కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. కపిల్​, కుంబ్లే సరసన చోటు
    IND VS ENG Bumra record: టీమ్​ఇండియా, ఇంగ్లాండ్​ టీమ్స్​ మధ్య జరుగుతున్న ఐదో మ్యాచ్​లో భారత పేసర్​ బుమ్రా మరో సూపర్​ రికార్డును సాధించాడు. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) జట్లపై అక్కడి మైదానాల్లో వంద వికెట్లకుపైగా సాధించిన ఆరో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జేమ్స్​ కామెరూన్ షాకింగ్​ నిర్ణయం.. 'అవతార్'​ నుంచి ఔట్​
    Avatar Director James cameron: హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్​.. అవతార్​ సినిమా ప్రియులకు షాక్ ఇచ్చారు. మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఎందుకంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.