ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : May 30, 2022, 12:56 PM IST

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

..

  • Yarapathineni: "పల్నాడు ప్రమాద బాధితులను... ప్రభుత్వం ఆదుకోవాలి"
    Yarapathineni: పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని పరామర్శించారు. మృతుల మట్టి ఖర్చుల కోసం తెదేపా తరఫున ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ATTACK: తెదేపా నేత సుభానిపై.. వైకాపా వర్గీయల దాడి.. కారణం అదేనా?
    ATTACK: అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసినందుకు తెలుగుదేశం నేత సుభానిపై వైకాపా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సుభాని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Raghuveera Reddy: పంట కోసిన రఘువీరారెడ్డి
    Raghuveera Reddy: పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రైతుగా మారారు. తన పొలంలో కోతకు వచ్చిన పంటను స్వయంగా ఆధునికి యంత్రాలతో కోసి ఆనందంలో మునిగి తేలారు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీ ఫొటోతోనే వాట్సాప్ స్టిక్కర్లు.. ఇలా తయారు చేసుకోండి..
    whatsapp: ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో మీ సొంత ఫొటోనే స్టిక్కర్‌గా మార్చడానికి ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ ఉందని మీకు తెలుసా..? లేదంటే వాట్సాప్‌లో స్టిక్కర్లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​' పథకానికి మోదీ శ్రీకారం
    PM CARES for Children Scheme: కొవిడ్​ కారణంగా అనాథలైన పిల్లలకు సాయం అందించే పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరు వారితోనే ఉన్నారనే భరోసాను కల్పిస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విద్యుత్తు అధికారులపై రైతు 'మిక్సీ' నిరసన.. ఆరు నెలలుగా ఆఫీసులోనే..!
    విద్యుత్తు కనెక్షన్​ ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సరికొత్త మార్గంలో నిరసన తెలిపారు ఓ రైతు. విద్యుత్తు కేంద్రంలోనే వంట సామగ్రిని మిక్సీ పట్టుకుంటున్నారు. ఇలా ఒక్క రోజు కాదు.. ఆరు నెలలుగా ప్రతిరోజు చేస్తూన్నా అధికారుల్లో చలనం రావటం లేదు. ఈ సంఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.6వేలకే లింగ నిర్ధరణ, అబార్షన్​.. ముఠా అరెస్ట్​
    illegal sex determination racket In Dharmapuri: అక్రమంగా లింగ నిర్ధరణ పరీక్షలు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు చెన్నై ధర్మపురి పోలీసులు. ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి స్కానింగ్​ మెషీన్​, రెండు కార్లు, ఆటో, స్కూటర్​ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. పడిపోయిన బిట్​కాయిన్​
    Gold Price: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,950గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బిట్​ కాయిన్ విలువ పడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​ విన్నింగ్​ టీమ్​ ప్రైజ్​మనీ ఎంత? బట్లర్​ మాత్రం గంపగుత్తగా కొట్టేశాడుగా..
    ఐపీఎల్‌-2022 సీజన్​ ఘనంగా ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్​ మ్యాచ్​లో గుజరాత్​ టైటాన్స్​ విజేతగా నిలిచింది. అయితే ఈ సీజన్​లో ప్రైజ్​ మనీ విషయం చర్చనీయాంశంగా మారింది. ఏ టీమ్​ ఎంత గెలుచుకున్నది? వ్యక్తిగతంగా ఎవరు ఎక్కువ సొమ్మును సొంతం చేసుకున్నారు? ఈ సీజన్​లో రాజస్థాన్​ ప్లేయర్​ బట్లర్​ మాత్రం గంపగుత్తగా మెజార్టీ విభాగాల్లో 'బెస్ట్'గా నిలిచి.. వ్యక్తిగతంగా అత్యధికంగా ప్రైజ్​మనీని సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నేను అతడిని ప్రేమిస్తున్నా..' పెదవి విప్పిన అనుపమ
    మలయాళం మూవీ 'ప్రేమమ్‌'తో కుర్రకారు మదిని దోచుకుంది అనుపమ పరమేశ్వరన్​. 'అ ఆ'తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడు తన ప్రేమ, ప్రేమికుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.