ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @1PM

author img

By

Published : Dec 8, 2021, 12:58 PM IST

top news
ప్రధాన వార్తలు @1PM

.

  • ఉద్యోగుల పోరుబాట.. నల్ల బ్యాడ్జీలతో రెండోరోజూ నిరసనలు
    ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఏపీ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "వారందరికీ.. రేషన్, పింఛన్ నిలిపివేయండి" అధికారుల ఆదేశం
    విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామానికి చెందిన పలువురికి రేషన్, పింఛన్ నిలిపివేయాలని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాంట్రాక్టు కార్మికుల ఆందోళన.. భక్తులకు తప్పని ఇబ్బందులు
    తిరుమలలో పారిశుధ్య ఒప్పంద కార్మికుల ఆందోళనతో.. తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
    ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'రైతుల వెంటే కాంగ్రెస్.. సభలో పోరాటం ఆగదు'
    కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ద్రవ్యోల్బణం, రైతుల మరణాలపై మాట్లాడిన సోనియా.. సర్కారు తీరును తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ట్రిపుల్ మర్డర్ చేసి 11 ఏళ్లుగా పరారీ- పెన్షన్ డ్రా చేస్తూ...
    ఇద్దరు పిల్లలు సహా భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు అతడు. అరెస్టయ్యాక కారంపొడి జల్లి.. పోలీసుల చెర నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. వేరే ప్రాంతానికి చేరుకుని మరో మహిళను పెళ్లిచేసుకున్నాడు. అలా 11 ఏళ్లపాటు పరారీలో ఉన్న అతడు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫేస్‌బుక్‌పై 150 బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా
    మయన్మార్‌ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాలు పోస్టు కాకుండా అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రొహింగ్యా శరణార్థులు 150 బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • '2021-22లో భారత వృద్ధి రేటు 8.4 శాతం!'
    మరోసారి జీడీపీ వృద్ధిరేటు అంచనాను తగ్గించింది ఫిచ్ రేటింగ్స్​. ఈసారి 8.4 శాతానికి పరిమితం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'నా పదవీ కాలంలో అదే అత్యంత దారుణ ప్రదర్శన'
    అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డేనైట్ టెస్టులో టీమ్ఇండియా 36 పరుగులకే ఆలౌటవడం ప్రతి అభిమానికి గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన భారత మాజీ కోచ్ రవిశాస్త్రి.. ఈ ఇన్నింగ్స్ తన పదవీకాలంలో అత్యంత దారుణమైన ప్రదర్శన అని గుర్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈడీ విచారణకు బాలీవుడ్​ నటి
    మనీలాండరింగ్​ కేసులో మరోసారి ఈడీ ఎదుట హాజరైంది బాలీవుడ్​ నటి జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​. సుకేశ్​ చంద్రశేఖర్​కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్​ కేసులో ఆమెను అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.