ETV Bharat / city

Top news: ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Nov 15, 2021, 1:02 PM IST

top news
top news

...

  • రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయినట్లు అనిపిస్తోంది.. రాజధాని కేసుల విచారణలో హైకోర్టు
    హైకోర్టులో రాజధాని కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • DP COMPLAINT: దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ.. ఎస్​ఈసీకి ఫిర్యాదు
    వైకాపా అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ తెదేపా నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ... ఎమ్మెల్సీ అశోక్ బాబు అశోక్‌బాబు, బొండా ఉమ, బోడె ప్రసాద్​లు ఎస్ఈసీ నీలం సాహ్నీకి వినతిపత్రం అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • AP LOCAL BODY ELECTIONS: పంచాయతీ ఎన్నికల్లో.. విజేతలు వీరే
    రాష్ట్రంలో ఆదివారం జరిగిన 6 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఒంటిగంటకు పూర్తయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

    విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి- 1500 కిలోలు సీజ్​​
    అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను (ganja seized) ముంబయి ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఇద్దరిని అరెస్ట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • BUS BOLTHA: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు!
    అనంతరపురం జిల్లా కోడూరుతోపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్​ టేక్ చేయబోయి.. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పూర్తి స్థాయి లాక్​​డౌన్​ విధించేందుకు సిద్ధమే'
    దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకుగాను పూర్తి స్థాయి లాక్​డౌన్ విధించేందుకు తాము సిద్ధమేనని సుప్రీంకోర్టుకు దిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే.. రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో కూడా లాక్​డౌన్​ విధిస్తే.. మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'భారత్​పై ఆంక్షలా.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు'
    రష్యా నుంచి ఎస్​-400 ఆయుధ వ్యవస్థను (S400 Air Defence system) కొనుగోలు చేసినందుకు భారత్​పై ఆంక్షలు విధించే (CAATSA sanctions) అంశంపై నిర్ణయం తీసుకోలేదని అమెరికా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Gold Price Today: తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..
    ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర (Gold Price today) భారీగా తగ్గింది. వెండి ధర కూడా అదే దారిలో పతనమైంది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.200 తగ్గగా.. వెండి ధర (Silver price today) కిలోకు రూ.610 కిందికి దిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆసీస్​ గెలుపు సంబరాలు.. బూటులో కూల్​డ్రింక్​ పోసుకొని
    కివీస్​పై ఆసీస్​ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆటగాళ్లు సంబరాల్లో (Australia Celebration T20) మునిగి తేలారు. అయితే వాళ్లు సెలబ్రేషన్స్​ చేసుకున్న తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్లేయర్స్​.. షూస్​లో కూల్​డ్రింక్​ పోసుకొని తాగారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆసక్తిగా 'గని' టీజర్​.. 'రాంబో'గా విజయ్​సేతుపతి
    కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో వరుణ్​తేజ్​ 'గని' టీజర్​, విజయ్​ సేతుపతి 'కాతువక్కుల రెండు కాదల్' ఫస్ట్​లుక్​ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.