ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : May 29, 2021, 1:07 PM IST

.....

top news
ప్రధాన వార్తలు

  • రహస్య ప్రాంతానికి ఆనందయ్య.. మందుపై నివేదికలు వచ్చేవరకు అంతేనా?
    నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలించారు. తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో తీసుకెళ్లారు. ఆనందయ్య మందు కోసం.. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు కృష్ణపట్నం వస్తున్నారు. మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Cocktail antibodies: కాక్‌టెయిల్‌ యాంటీ బాడీస్‌తో కరోనా రోగుల్లో సత్ఫలితాలు
    కరోనా రోగులకు కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్‌ ఇవ్వడం వల్ల త్వరితగతిన కోలుకుంటున్నారని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ కె.గోపాలకృష్ణ తెలిపారు. ఇటీవల ప్రయోగాత్మకంగా విజయవాడలో ఇద్దరికి ఇలా చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Arrest: చిత్తూరు జిల్లా పరువు హత్య కేసు: నిందితులు అరెస్టు
    చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో శుక్రవారం వెలుగుచూసిన పరువు హత్య కేసులో.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కల్తీ మద్యం: 28కి చేరిన మృతుల సంఖ్య
    ఉత్తర్​ప్రదేశ్​లో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 28కి చేరింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అబ్కారీ అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్‌.. దర్యాప్తునకు ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బైక్​పై వచ్చి కాల్పులు- డాక్టర్ దంపతులు మృతి
    కారులో వెళుతున్న డాక్టర్​ దంపతులను ఇద్దరు వక్తులు బైక్​పై కాల్చిచంపారు. ఈ ఘటన రాజస్థాన్​లోని భరత్​పూర్​లో జరిగింది. ఓ యువతి హత్య కేసులో డాక్టర్‌ దంపతుల ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాక్​లో కశ్మీర్​ ప్రస్తావనపై భారత్ మండిపాటు
    పాకిస్థాన్ పర్యటనలో భాగంగా కశ్మీర్​పై ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. ఈ వ్యాఖ్యలు ప్రపంచ వేదికపై ఆయన స్థాయి దిగజార్చే విధంగా ఉన్నాయని ఘాటుగా స్పందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైనా నౌకల నుంచి ఆహారం దిగుమతికి అమెరికా నో!
    డాలియన్​ సంస్థకు చెందిన 30కుపైగా నౌకల నుంచి దిగుమతులను అమెరికా నిషేధించింది. కార్మికులను యాజమాన్యం బానిసలుగా చూస్తోందని ఆరోపించింది. ఈ తరహా వైఖరిని సహించేది లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రోహిత్ సారథ్యంలో ఆడాలని ఉంది: వాన్
    ధోనీ, కోహ్లీ ఇద్దరు ఉత్తమ సారథులు అని చెప్పినప్పటికీ.. అన్ని ఫార్మట్లలో కలిపి మహీనే గొప్ప సారథి అని తన అభిప్రాయాన్ని చెప్పాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైఖేల్‌ వాన్‌​. రోహిత్​ శర్మ నాయకత్వంలో ఐపీఎల్​ ఆడాలని ఉందని తన మనసులోని మాటను తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • puri musings: ఆ దేశాల్లో మనశ్శాంతిగా బతకొచ్చు
    'పూరీ మ్యూజింగ్స్'​ పేరుతో వివిధ అంశాలపై మాట్లాడుతున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా నేషనల్ హెల్త్​కేర్ సిస్టమ్ గురించి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.