ETV Bharat / city

ap topnews ప్రధానవార్తలు11AM

author img

By

Published : Aug 30, 2022, 10:58 AM IST

.

11am topnews
ప్రధానవార్తలు11AM

  • మా సొమ్ము ఆర్టీసీకి ఎందుకు

ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజన పథకాన్ని (ఎస్‌ఆర్‌బీఎస్‌) రద్దు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. 8శాతం వడ్డీతో ఉద్యోగులకు సెటిల్‌మెంట్‌ చేస్తోంది. అయినా యాజమాన్యం వద్ద ఇంకా రూ.120 కోట్లు మిగులుతాయని ఉద్యోగ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి.

  • ఫ్లెక్సీల నిషేధంతో పరిశ్రమకు భారీ దెబ్బ

ప్లాస్టిక్‌ నిర్మూలనలో భాగంగా ఫ్లెక్సీలు నిషేధిస్తున్నాన్న ముఖ్యమంత్రి ప్రకటన వ్యాపార వర్గాల్లోఆందోళన రేకెత్తిస్తోంది. అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల వేల మంది రోడ్డున పడే ప్రమాదముందనిఫ్లెక్స్‌ ప్రింటింగ్‌ నిర్వాహకులు వాపోతున్నారు. పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.

  • నన్ను బూచిగా చూపి ప్రకాశ్‌పై చర్యలు

తనను బూచిగా చూపి ఏఆర్​ కానిస్టేబుల్​ ప్రకాశ్‌పై చర్యలు తీసుకున్నారని కానిస్టేబుల్‌ డిస్మిస్‌ కేసులో బాధితురాలు లక్ష్మి వాపోయారు. ప్రకాశ్‌ తన నుంచి 30 తులాల బంగారం, రూ.10 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు మోపిన అభియోగంలో నిజం లేదని స్పష్టంచేశారు. కానిస్టేబుల్‌ తనను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, కక్ష సాధింపులో భాగంగానే తనను అడ్డం పెట్టుకుని ఆయనను డిస్మిస్‌ చేశారని వాపోయారు.

  • మహిళను దారుణంగా చంపి, ఆపై

ఓ మహిళను అతికిరాతకంగా హత్యచేసి ఒంటి మీద బంగారు నగలు దోచుకెళ్లిన ఘటన బాపట్లజిల్లా చీరాలలో చోటుచేసుకుంది. చీరాలలోని ఆంధ్రరత్న రోడ్డులో వూట్ల మదనగోపాలమూర్తి, విజయలక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయలక్ష్మీ గొంతునులిమి, అతికిరాతకంగా తలమీద మోది హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లాడు.

  • దేశంలో తగ్గిన కొవిడ్​ కేసులు, జపాన్​లో ఆగని ఉద్ధృతి, భారీగా మరణాలు

దేశంలో సోమవారం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 5,439 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.15 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • పూరీ క్షేత్రంలో వెలకట్టలేని సంపద, కాపలాగా సర్పాలు

ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారంలో స్వామి సంపద ఎంత ఉంది? అందులోని మూడో గదిని తెరవరెందుకు? అనే విషయాలపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందన్న సమాచారమూ వినిపిస్తోంది. ఈ గదిలో అపార సంపద (వజ్ర, వైడూర్య, గోమేధిక, పుష్పరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు) ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.

  • సగానికిపైగా పాకిస్థాన్‌ వరదలోనే, 1100 దాటిన మృతులు, మోదీ ఏమన్నారంటే

భీకర వరదలు పాకిస్థాన్​ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు వరదల ధాటికి 1,136 మంది ప్రాణాలు కోల్పోయారు. సగానికి పైగా పాకిస్థాన్ వరద నీటిలోనే మగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్​ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

  • రూ.12 వేలలోపు చైనా ఫోన్లపై నిషేధం, స్పష్టతనిచ్చిన కేంద్రం

చైనా కంపెనీలు తయారు చేస్తున్న రూ.12 వేలలోపు ఫోన్లను నిషేధించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల ఇందుకు సంబంధించి వార్తలు వచ్చిన నేపథ్యంలో వివరణ ఇచ్చింది. చైనా మొబైల్‌ తయారీ సంస్థలు వ్యాపార కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేలా చేయడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొంది.

  • టీమ్​ఇండియా ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్‌, స్టార్​ పేసర్​ వచ్చేస్తున్నాడు

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు టీమ్​ఇండియా అభిమానులకు గుడ్‌ న్యూస్‌. గాయం కారణంగా ఆసియా కప్‌ 2022కు దూరమైన భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జస్ప్రీత్‌ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచ కప్‌కు కూడా అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

  • బుల్లితెరపై మహేశ్​ సితార డ్యాన్స్​, ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్​ బాబు.. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్​హిట్​ అందుకున్న ఆయన రీల్​ లైఫ్​లోనే కాకుండా రీయల్ లైఫ్​లోనూ హీరో అనిపించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.