ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : May 3, 2022, 11:00 AM IST

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM

..

  • దక్షిణాది గ్రిడ్‌లో లోపం.. ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిన విద్యుదుత్పత్తి
    ఎన్టీపీసీ సింహాద్రిలో 4 యూనిట్లలోని విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. 2 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎన్టీపీసీ పరిసరాలు అంధకారంలోకి వెళ్లాయి. అయితే.. దాదాపు రెండు గంటల తర్వాత గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా తిరిగి ఆరంభం కావడంతో సింహాద్రిలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Varla Ramaiah Letter: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ
    Varla Ramaiah letter: పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కోసం వెళ్లిన బాధితుడిపై చేయి చేసుకున్న ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ రాశారు. తల్లి పింఛను తొలగించడాన్ని ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు పీఎస్‌లో దాడి ఈ ఘటనపై విచారణ జరిపాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తి మర్మంగాలు కోసేసిన కుమార్తె
    Secret parts cut: ఓ వైపు మద్యం మత్తు చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.. మరోవైపు వివాహేతర సంబంధాలు కుంటుంబాలను కుదిపేస్తున్నాయి.. ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి... ఇవి దంపతుల జీవితాలనే కాదు... పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి... తాజాగా తల్లితో వివాహేతరం సంబంధం పెట్టుకున్న వ్యక్తి మర్మంగాలను కుమార్తె కోసేసిన దారుణ ఘటనే ఇందుకు నిదర్శనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మద్యం మత్తులోనే మహిళలపై దుశ్చర్యలు..!
    రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలకు మద్యపానం ప్రధాన కారణమవుతోంది. ఆయా ఘటనల్లో నిందితులు పూటుగా మందు తాగి ఆ మైకంలో ఉచ్ఛనీచాలు మరచి దుశ్చర్యలకు తెగబడుతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అత్యాచార ఘటనల్లో అరెస్టవుతున్న నిందితుల్లో 60శాతం మంది వరకూ మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఘనంగా రంజాన్​.. కిక్కిరిసిన ప్రార్థనా మందిరాలు.. వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
    Eid-Ul-Fitr India: దేశవ్యాప్తంగా ఈద్​ ఉల్​ ఫితర్​ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల తర్వాత దిల్లీలోని జామా మసీద్​కు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రార్థనలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సైకిల్​పై 'ఫుడ్'​ డెలివరీ.. యువకుడిని చూసి పోలీసులు చేసిన పనికి..!
    మధ్యప్రదేశ్​, ఇందోర్​లోని విజయ నగర్​ పోలీస్​ స్టేషన్​ సిబ్బంది ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆర్థిక కష్టాలతో ద్విచక్ర వాహనం కొనుక్కోలేక సైకిల్​పైనే ఫుడ్​ డెలివరీ చేస్తున్న ఓ యువకుడికి సాయం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • '3 దశాబ్దాల రాజకీయ అస్థిరతను భారత్​ ముగించింది'
    ఒక్క బటన్​ నొక్కడం ద్వారా మూడు దశాబ్దాల రాజకీయ అస్థిరతను భారత ప్రజలు ముగించారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మూడో రోజుల ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన.. జర్మనీలోని ప్రవాసులతో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Chess Olympiad: చదరంగ యుద్ధానికి సైన్యమిదే
    Chess Olympiad 2022 Team India: స్వదేశంలో జులై 28న ఆరంభమయ్యే చెస్‌ ఒలింపియాడ్‌కు భారత్‌ మహాసేనను ప్రకటించింది. ఇందుకోసం ఈ సారి ఏకంగా నాలుగు జట్లను బరిలోకి దింపనుంది. అయితే ఈ టీమ్స్​లో తెలుగు గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. వారెవరో చూద్దాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పుష్ప 2' స్క్రిప్ట్​లో​ మార్పులు.. చిత్ర నిర్మాత​ ఏమన్నారంటే?
    Pushpa 2 script changes: 'కేజీయఫ్​ 2' భారీ విజయం సాధించడం వల్ల.. దాని ప్రభావం 'పుష్ప 2'పై పడొచ్చని వార్తలు వచ్చాయి. దీంతో రెండో భాగం స్క్రిప్ట్​లో దర్శకుడు సుకుమార్​ మార్పులు చేస్తున్నారని ప్రచారం సాగింది. అయితే తాజాగా దీనిపై స్పందించారు చిత్ర నిర్మాత వై రవిశంకర్​. ఆయన ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • షారుక్​ 'పఠాన్‌' ఓటీటీ రైట్స్​ 200 కోట్లు?
    Sharukhkhan Pathan movie 200crores: బాలీవుడ్ బాద్​ షా షారుక్ ఖాన్​ నటిస్తున్న 'పఠాన్'​ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీ డిజిటల్‌ హక్కులను రూ.200 కోట్ల భారీ మొత్తానికి అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.