ETV Bharat / city

తెలంగాణ: నల్గొండ-ఖమ్మం-వరంగల్​లో 10 మంది ఎలిమినేషన్

author img

By

Published : Mar 19, 2021, 9:25 AM IST

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో.. రెండో ప్రాధాన్యతను గుర్తించే ప్రక్రియ ఉదయం ఆరున్నర గంటలకు మొదలైంది

10-members-eliminated
10-members-eliminated

తెలంగాణ నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో.. రెండో ప్రాధాన్యతను గుర్తించే ప్రక్రియ ఉదయం మొదలైంది. అభ్యర్థుల సమక్షంలో.. ఎలిమినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. తొలి గంటన్నరలో.. 10 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు.

ఇప్పటివరకు ఎలిమినేషన్ పూర్తయిన అభ్యర్థుల్లో ఒక్కొక్కరికి వచ్చిన మొత్తం ఓట్లు... 10 నుంచి 15 లోపు ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇలా పోలై, చెల్లుబాటు అయిన ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చే వరకు ఇలా ఎలిమినేషన్​ ప్రక్రియ కొనసాగుతుంది.

ఎవరికెన్ని రావాలి..

పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందాలంటే 72,327 ఓట్లు రావాలి. తీన్మార్ మల్లన్నకు 99,877 ఓట్లు, కోదండరామ్​కు 1,13,095 ఓట్లు కావాలి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 1,10,840, తీన్మార్​ మల్లన్నకు 83,290, కోదండరాంకు 70,072 ఓట్లు వచ్చాయి.

మొదటి ప్రాధాన్యత ఓట్లు

క్రమ సంఖ్యఅభ్యర్థులుఓట్లు
1పల్లా రాజేశ్వర్​ రెడ్డి1,10,840
2తీన్మార్​ మల్లన్న83,290
3కోదండరాం70,072

ఇదీ చదవండి: కాకినాడ ఎల్విన్‌పేటలో అగ్నిప్రమాదం... మహిళ సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.