ETV Bharat / bharat

భజరంగ్​దళ్ కార్యకర్తపై దాడికి యత్నం.. త్రుటిలో తప్పిన ప్రమాదం

author img

By

Published : Jan 9, 2023, 5:52 PM IST

భజరంగ్​దళ్ కార్యకర్తపై కొడవలితో దాడికి యత్నించాడు ఓ యువకుడు. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

bajrang dal activist attack
భజరంగ్​దళ్ కార్యకర్తపై దాడికి యత్నం

కర్ణాటక శివమొగ్గలో దారుణం జరిగింది. ఓ యువకుడు కొడవలితో భజరంగ్​దళ్​ కార్యకర్తపై దాడికి యత్నించాడు. సోమవారం ఉదయం జరిగిందీ ఘటన. ఈ దాడిలో సునీల్ అనే భజరంగ్​దళ్​ కార్యకర్త ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సునీల్​.. భజరంగ్​దళ్​ సాగర్ సిటీ కో-కన్వీనర్​గా ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సాగర్ కొత్త బస్టాండ్​లో సమీపంలో ఉన్న భజరంగ్​దళ్ కార్యాలయానికి సునీల్ బైక్​పై వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు సునీల్‌ను దగ్గరకు పిలిచాడు. బైక్​లో నుంచి కొడవలిని తీసి అతడిపై దాడికి ప్రయత్నించాడు.
'నేను ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్తున్నాను. ఈ సమయంలో ఓ యువకుడు నన్ను అసభ్యంగా దూషించాడు. అతడి దగ్గరకు నేను బైక్​పై వెళ్లగా కొడవలితో నాపై దాడికి యత్నించాడు.' అని సునీల్ తెలిపాడు.

bajrang dal activist attack
సీసీటీవీలో నమోదైన దాడి దృశ్యాలు
bajrang dal activist attack
పోలీస్ స్టేషన్​ ఎదుట ఆందోళన చేస్తున్న భజరంగ్​దళ్ కార్యకర్తలు

సునీల్​పై దాడిని భజరంగ్​దళ్​తో పాటు మరికొన్ని హిందూ సంఘాలు ఖండించాయి. సాగర్​ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.