TDP Protest Initiation Against Chandrababu Arrest: చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆ పార్టీ నేతలు ‘సత్యమేవ జయతే’ పేరుతో దీక్ష చేపట్టారు. దిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రాజమహేంద్రవరంలోని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు, ముఖ్యనేతలు దీక్షలో కూర్చొన్నారు.
Nara Bhuvaneshwari Protest Initiation Against Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత అరెస్టుకు నిరసనగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో సత్యమేవ జయతే పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు. భువనేశ్వరికి సంఘీభావంగా తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ శాసనసభ స్పీకర్ ప్రతిభా భారతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, నన్నపనేని రాజకుమారి సహా పలువురు మహిళా నేతలు పాల్గొన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యగానే చంద్రబాబును అరెస్టుచేశారని వంగలపూడి అనిత అన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మహిళా నేతలు ఆకాంక్షించారు.
Lokesh Protest Initiation in Delhi: సైకో జగన్ ఫ్యాక్షన్‌పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతుగా దిల్లీలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో సత్యమేవ జయతే పేరుతో నిరాహార దీక్షను లోకేశ్ ప్రారంభించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లోకేశ్‌కు మద్దతుగా టీడీపీ ఎంపీలు, నేతలు దీక్షలో పాల్గొన్నారు. సీఎం జగన్ రాజ్యాంగాన్ని కాలరాసి, సత్యాన్ని వధించారని లోకేశ్ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. సీఎం జగన్ అరాచకాలను నిరసిస్తూ దీక్ష చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నానని లోకేశ్ ట్వీట్ చేశారు
TDP Leaders Protest Initiation at Party Office: అక్రమ కేసుల నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తంచేశారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్న సైకో జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. పార్టీ సీనియర్ నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి దీక్ష చేపట్టారు. అరెస్టు చేసి 24 రోజులు గడుస్తున్నా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా బాబుకు తోడుగా అంటూ నిరసనల్లో పాల్గొనడం అధినేత పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించిన జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలుగుదేశం మహిళా నేతలు హెచ్చరించారు. మంగళగిరి తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహిస్తున్న దీక్షల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Live Updates : టీడీపీ నాయకుల నిరాహార దీక్షలు.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా..
Nara Bhuvaneshwari Tweet: తండ్రి ఎన్టీఆర్ జ్ఞాపకాలతో తన హృదయం నిండిపోయిందంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. తెలుగుజాతి కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారంటూ కొనియాడారు. సత్యం ఎంత కఠినంగా ఉన్నా ఎప్పుడూ కట్టుబడి ఉండాలని ఎన్టీఆర్ బోధించారని గుర్తుచేసుకున్నారు. న్యాయం కోసం ఎన్టీఆర్ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. తెలుగువారికి సేవ చేయడంలో ఎన్టీఆర్ చూపిన అంకితభావం ప్రజలందరితో పాటు ఆయన పిల్లలైన తమకూ ఆదర్శమని కీర్తించారు.