ETV Bharat / bharat

'రాష్ట్రపతిని కాను.. అయితే ప్రధాని.. లేదంటే యూపీ సీఎం!'

Mayawati president of India: రాష్ట్రపతి కావడంపై బీఎస్​పీ అధినేత్రి మాయావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పదవి చేపట్టేందుకు తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అణగారిని వర్గాల కోసం పనిచేయాలన్న లక్ష్యం కోసం ప్రధాని అయ్యేందుకే తాను ప్రాధాన్యమిస్తానని తేల్చిచెప్పారు.

mayawati president news
'రాష్ట్రపతిని కాను.. అయితే ప్రధాని.. లేదంటే యూపీ సీఎం!'
author img

By

Published : Apr 28, 2022, 4:34 PM IST

'భారత దేశ రాష్ట్రపతిగా మాయావతి!'.. చాలాకాలంగా వినిపిస్తున్న మాట. బీఎస్​పీ అధినేత్రి మాయావతిని అధికార పక్షం భాజపానే దేశ అత్యున్నత పదవిలో కూర్చోబెడుతుందన్నది ఆ ఊహాగానాల సారాంశం. దీనిని విమర్శనాస్త్రంగా చేసుకున్నారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. "ఇటీవల జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల్లో బీఎస్​పీ ఓట్లన్నీ భాజపాకు బదిలీ అయ్యాయి. ఇందుకు ప్రతిఫలంగా భాజపా మాయావతిని రాష్ట్రపతిని చేస్తుందా లేదా చూడాలి" అని బుధవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు అఖిలేశ్.

ఎస్​పీ అధినేత అఖిలేశ్​ వ్యాఖ్యలపై గురువారం లఖ్​నవూలో తీవ్రంగా స్పందించారు మాయావతి. "స్వార్థపూరిత రాజకీయ దురుద్దేశంతోనే నేను రాష్ట్రపతిని కావాలని ఎస్​పీ కల కంటోంది. అది నేరవేరదు. నేను రాష్ట్రపతిని అయితే అఖిలేశ్​ యూపీ సీఎం అయ్యేందుకు మార్గం సుగమం అవుతుందన్నది ఎస్​పీ ఆశ. అది అసాధ్యం.

భవిష్యత్​లో నేను యూపీ ముఖ్యమంత్రిని లేదా భారత దేశ ప్రధాన మంత్రి కావాలని మాత్రమే కల కంటా. రాష్ట్రపతి కావాలని ఎప్పుడూ అనుకోను. జీవితంలో నేను ఎప్పుడూ సుఖాల కోసం చూసుకోలేదు. అంబేడ్కర్, కాన్షీ రామ్​ చూపిన మార్గంలో అణగారిన వర్గాల ప్రజలు సాధికారిత సాధించేలా చూసేందుకు శ్రమించా. ఈ పని రాష్ట్రపతి చేయలేరని.. యూపీ సీఎం లేదా దేశ ప్రధాని అయితేనే సాధ్యమని మీ అందరికీ తెలుసు" అని స్పష్టం చేశారు మాయ. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, ముస్లింలు, అగ్రవర్ణ పేదలు బీఎస్​పీకి అండగా నిలిస్తే.. తాను మళ్లీ యూపీ సీఎం లేదా దేశ ప్రధాని కావడం సాధ్యమని అన్నారు.

భాజపా-బీఎస్​పీ క్విడ్​ ప్రో కో!: యూపీలో ఒకప్పుడు అధికారంలో ఉన్న బీఎస్​పీ.. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక సీటుతో సరిపెట్టుకుంది. బీఎస్​పీ ఓట్లన్నీ భాజపాకు బదిలీ అయ్యాయని అనేక విశ్లేషణలు వచ్చాయి. ఉత్తర్​ప్రదేశ్​ భాజపా నేతలు పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపిన నివేదికలోనూ ఇదే విషయం ప్రస్తావించారు.

Mayawati president of India: ఎన్నికల ప్రచారం సమయంలోనూ భాజపా-బీఎస్​పీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, మాయావతిని అత్యున్నత రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టవచ్చని అఖిలేశ్​ విమర్శలు సంధించారు. మరోవైపు.. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఎస్​పీ, బీఎస్​పీ కలిసి పోటీ చేయడం విశేషం. ఆ తర్వాత రెండు పార్టీలు విడిపోగా.. ఇరువురు నేతలు పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.