ETV Bharat / bharat

గొంతు కోసి రక్తం తాగిన వ్యక్తి.. వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​

author img

By

Published : Jun 25, 2023, 3:39 PM IST

Updated : Jun 25, 2023, 4:33 PM IST

కర్ణాటకలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి మరో మనిషి గొంతుకోసి.. అనంతరం అతడి రక్తాన్ని తాగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

man-slits-another-person-throat-and-drinks-blood-in-karnataka
మనిషి గొంతు కోసి అతడి రక్తాన్ని తాగిన మరో వ్యక్తి

ఓ వ్యక్తి మరో మనిషి గొంతుకోసి.. అతడి రక్తాన్ని తాగిన ఘటన కర్ణాటకలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారడం వల్ల.. విషయం వెలుగులోకి వచ్చింది. మాట్లాడుకుందామని మారేశ్​ అనే వ్యక్తిని పిలిచిన విజయ్​.. అనంతరం ఈ దారుణానికి పాల్పడ్డాడు. చిక్కబళ్లాపుర్​లో జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విజయ్.. చింతామణి తాలూకాలోని బెలహళ్లి గ్రామానికి చెందిన వ్యక్తి. మారేశ్​.. చేలూరు తాలూకాలోని మాడెంపల్లి నివాసం ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం మారేశ్​కు ఫోన్​ చేసిన విజయ్​.. తనతో మాట్లాడాల్సి ఉందన్నాడు. అనంతరం వీరిద్దరూ చింతామణి పరిధిలోని సిద్దెపల్లి వద్ద కలుసుకున్నారు. కుటుంబ సమస్యలపై ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. అది కాస్తా వాగ్వాదానికి దారితీసింది. దీంతో మారేశ్​ గొంతును కత్తితో కోశాడు విజయ్​. తరువాత గొంతు వద్ద నోరుపెట్టి.. మారేశ్​ రక్తాన్ని తాగాడు. దీన్ని మరో వ్యక్తి వీడియో తీశాడు. ఘటనకు సంబంధించిన వీడియో, సామాజిక మాధ్యమాల్లో వైరల్​ మారి.. పోలీసులు దృష్టికి వెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మారేశ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు పేర్కొన్నారు.

కుక్కలకు ఆహారం పెడుతున్నారని..
కుక్కలకు ఆహారం పెడుతున్న 22 ఏళ్ల యువతి, ఆమె తమ్ముడిపై.. ఇంటి పక్కనే నివాసం ఉండే ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. కత్తులు, బ్లేడ్​లతో అక్కాతమ్ముళ్లను దారుణంగా గాయపరిచారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిమ్రాన్ అనే యువతి ముంబయిలోని సిక్కా నగర్‌లో నివాసం ఉంటోంది. రాజ్‌కుమార్ మిశ్రా, రితికా మిశ్రా, రాజేష్ మిశ్రా అనే ముగ్గురు వ్యక్తులు.. అక్కాతమ్ముళ్లపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై జస్ట్ స్మైల్ అనే ఛారిటబుల్ ట్రస్ట్​కు సమాచారం అందింది. అనంతరం అక్కడికి చేరుకున్న ట్రస్ట్​ సభ్యులు.. వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు ప్రస్తుతం జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిమ్రాన్​కు 46 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ఆమె తమ్ముడికి(14) కుడా గాయాలైనట్లు వారు వెల్లడించారు.

"అక్కాతమ్ముళ్లు నిత్యం కుక్కలకు ఆహారం పెడుతుండేవారు. అది ఇష్టం లేని నిందితులు.. వీరిని దుర్భాషలాడేవారు. వారిని అవమానించేలా మాట్లాడుతూ.. కుక్కలకు ఆహారం పెట్టవద్దని బెదిరించేవారు." అని స్థానికులు తెలిపారు. జస్ట్ స్మైల్ అనే ఛారిటబుల్ ట్రస్ట్​ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం బాలుడిపై నిందితులు దాడి చేశారని వారు వెల్లడించారు. కుక్కలకు ఆహారం పెట్టిందుకుకే నిందితులపై దాడి జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో.. విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Last Updated : Jun 25, 2023, 4:33 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.