బిహార్ సమస్తిపుర్లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ప్రియురాలి గ్రామానికి వెళ్లిన ఓ యువకుడిని పట్ల గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. యువకుడితో నేలపై ఉమ్మి వేయించి అతడితోనే నాకించారు. గ్రామంలోకి ఇంకెప్పుడూ రాకూదని బెదిరించి విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వీడియో పోలీసులకు దృష్టికి చేరగా.. పలువురు గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ జరిగింది.. ఉజియార్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెహసారి గ్రామానికి చెందిన యువకుడు.. చఖబీబ్ గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని దింపేందుకు బైక్పై ఆమె గ్రామానికి వెళ్లాడు. వీరిద్దరినీ చూసిన గ్రామస్థులు.. యువకుడిని పట్టుకుని అతడిపై దాడి చేశారు. అనంతరం పంచాయితీ పెట్టి.. యువకుడితో లాలాజలాన్ని నేలపై వేయించి అతడితోనే నాకించారు. ఇంకెప్పుడూ గ్రామంలోకి రావద్దని బెదిరించి విడిచిపెట్టారు. యువకుడిపై గ్రామస్థులు పాల్పడుతున్న దుశ్చర్యను ఓ వ్యక్తి వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ విషయం పోలీసులు దృష్టికి చేరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: అమ్మాయిని 'ఐటమ్' అని పిలిచినందుకు ఏడాదిన్నర జైలు శిక్ష
'ఆసియాలోని టాప్ 10 కాలుష్య నగరాల్లో 8 భారత్లోనే.. అందులో దిల్లీ మాత్రం లేదు'