ETV Bharat / bharat

కాంగ్రెస్​కు కొత్త తలనొప్పి..​ 'హిమాచల్​ సీఎం' విషయంలో హైకమాండ్​దే ఫైనల్​

author img

By

Published : Dec 9, 2022, 10:25 PM IST

హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపాపై విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి ఎంపిక తలనొప్పిగా మారింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పేరు ఖరారు కాలేదు. సీఎం పదవిపై తుది నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు రాష్ట్ర నేతలు. ఇక హిమాచల్ సీఎం ఎవరనేది దిల్లీ హైకమాండ్​ నిర్ణయిస్తుంది

himachal pradesh
himachal pradesh

హిమాచల్‌ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ఎంపిక దృష్య్టా శిమ్లాలో కాంగ్రెస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కానీ ముఖ్యమంత్రి పేరు మాత్రం ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు రాష్ట్ర నేతలు. ఇక హిమాచల్ సీఎం ఎవరనేది దిల్లీ హైకమాండ్​ నిర్ణయిస్తుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్​ బఘేల్​, హరియాణా మాజీ సీఎం భూపిందర్​ సింగ్​ హుడా తెలుసుకున్నారు. మొత్తం సమాచారాన్ని హెకమాండ్​కు చేరవేయనున్నారు. సీఎం రేసులో పీసీసీ చీఫ్​ ప్రతిభా సింగ్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ముకేశ్​​ అగ్నిహోత్రి పేర్లు ముందంజలో ఉన్నాయి.

అయితే సమావేశానికి ముందుకు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టగలిగే సత్తా తనకు ఉందని వ్యాఖ్యానించారు. దివంగత నేత వీరభద్ర సింగ్ పేరు వల్లే హిమాచల్‌ ప్రదేశ్​లో కాంగ్రెస్ 40 సీట్లు సాధించిందని ఆమె పేర్కొన్నారు. అలాంటిది ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టడం సరికాదన్నారు. మరోవైపు ప్రతిభా సింగ్‌ తనయుడు శిమ్లా రూరల్ ఎమ్మెల్యే విక్రమాదిత్యా సింగ్ సైతం ఆయన తల్లికి మద్దతుగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు అంతా కలిసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని ఇదే విషయాన్ని పార్టీ పర్యవేక్షకులు హైకమాండ్‌కు చేరవేస్తారని చెప్పారు.

అంతకుముందు కాంగ్రెస్ పరిశీలకులైన ఛత్తీస్‌గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, ఏఐసిసి ఇంఛార్జ్ రాజీవ్ శుక్లా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను అందజేశారు. ముఖ్యమంత్రి పదవికి తీవ్ర పోటీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కావాలని కోరారు. గవర్నర్‌ను కలిసేందుకు కాంగ్రెస్ ముఖ్యనేతలు వెళ్లిన క్రమంలోనూ ప్రతిభా సింగ్ మద్దతుదారులు అడ్డుకున్నారు. వీరభద్ర సింగ్ కుటుంబానికే సీఎం పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు.

ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం హిమాచల్ సంప్రదాయంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గానూ 40 స్థానాలను కైవసం చేసుకుని భాజపా నుంచి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఓటమిని అంగీకరించిన హిమాచల్ సీఎం ఠాకూర్ గురువారం తన రాజీనామాను గవర్నర్​కు అందజేశారు. 68 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది. భాజపా 25, స్వతంత్ర అభ్యర్థులు 4 సీట్లు గెలుచుకోగా.. ఆప్ ఖాతా కూడా తెరవలేదు. నవంబర్ 12న పోలింగ్ జరగ్గా.. గురువారం ఫలితాలు వెలువడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.