ETV Bharat / bharat

మత్తుమందు ఇచ్చి బాలికపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Nov 2, 2022, 9:56 AM IST

శిక్షణకు వెళ్లి తిరిగి వస్తున్న బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హథ్రస్​లో జరిగింది.

gangrape in hathras
gangrape in hathras

ఉత్తర్​ప్రదేశ్​ హథ్రస్​లో మరో దారుణ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. శిక్షణకు వెళ్లి తిరిగి వస్తున్న బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు దుండగులు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
సాదాబాద్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో నివసించే ఓ బాలిక అక్టోబర్​ 10న కోచింగ్ సెంటర్​కు వెళ్లింది. అనంతరం తిరిగి వస్తున్న ఆమెను ఐదుగురు నిందితులు అడ్డగించారు. ఆమెకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్​ ఇచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను.. సమీపంలోని ఇంటర్ కాలేజీ ఆవరణలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు నిందితులు. అనంతరం కోచింగ్ సెంటర్​ వద్ద వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం బయట చెబితే చంపేస్తామంటూ బెదిరించడం వల్ల బాలిక ఎవరికీ చెప్పలేదు. ఇటీవల ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల యువతిని ప్రశ్నించగా.. అసలు విషయాన్ని బయటపెట్టింది.

ఇవీ చదవండి: నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం.. చెరకు తోటలో పడేసి..

పుట్టిన రోజునే పిల్లలపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన తండ్రి.. వైఫై పాస్​వర్డ్ కోసం బాలుడి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.