ETV Bharat / bharat

EMRS vacancy 2023 : ఏకలవ్య మోడల్ స్కూల్స్​లో 38,480 టీచర్​ పోస్టులకు నోటిఫికేషన్​

author img

By

Published : Jun 13, 2023, 1:02 PM IST

EMRS Recruitment 2023 : నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఏకలవ్య మోడల్​ రెసిడెన్సియల్ స్కూల్​​లో 38,480 టీచింగ్​, నాన్​-టీచింగ్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. పరీక్ష విధానం, ఇంటర్వ్యూ, ఎంపిక ప్రక్రియ తదితర పూర్తి వివరాలు మీ కోసం.

EMRS recruitment 2023
EMRS recruitment 2023 for 38,480 teaching and non teaching posts

EMRS recruitment 2023 notification : ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. నేషనల్ టెస్టింగ్​ ఏజెన్సీ.. 'ఏకలవ్య మోడల్​ రెసిడెన్సీ స్కూల్'​లో​ 38,480 టీచింగ్​, నాన్​-టీచింగ్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

టీచింగ్​ పోస్టుల వివరాలు:

  • ప్రిన్సిపల్ - 740 పోస్టులు
  • వైస్​-ప్రిన్సిపల్​ - 740 పోస్టులు
  • పోస్ట్​ గ్రాడ్యుయేట్​ టీచర్​ - 8,140 పోస్టులు
  • పోస్ట్​ గ్రాడ్యుయేట్ టీచర్ (కంప్యూటర్​ సైన్స్​) - 740 పోస్టులు
  • ట్రైన్డ్​ గ్రాడ్యుయేట్​ టీచర్ - 8,880 పోస్టులు
  • ఆర్ట్​ టీచర్​ - 740 పోస్టులు
  • మ్యూజిక్​ టీచర్​ - 740 పోస్టులు
  • ఫిజికల్​ ఎడ్యుకేషన్​ టీచర్​ - 1,480 పోస్టులు

నాన్​-టీచింగ్​ పోస్టులు :

  • లైబ్రేరియన్​ - 740 పోస్టులు
  • స్టాఫ్​ నర్స్​ - 740 పోస్టులు
  • హాస్టల్​ వార్డెన్​ - 1,480 పోస్టులు
  • అకౌంటెంట్​ - 740 పోస్టులు
  • కేటరింగ్​ అసిస్టెంట్​ - 740 పోస్టులు
  • చౌకీదార్​ - 1,480 పోస్టులు
  • కుక్​ - 740 పోస్టులు
  • కౌన్సిలర్​ - 740 పోస్టులు
  • డ్రైవర్​ - 740 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్​ కమ్​ ప్లంబర్​ - 740 పోస్టులు
  • గార్డెనర్​ - 740 పోస్టులు
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్​ - 1,480 పోస్టులు
  • లాబ్​ అటెండెంట్​ - 740 పోస్టులు
  • మెస్​ హెల్పర్​ - 1,480 పోస్టులు
  • సీనియర్​ సెక్రటేరియట్​ అసిస్టెంట్ - 740 పోస్టులు
  • స్వీపర్​ - 2,220 పోస్టులు

విద్యార్హతలు :

  • ప్రిన్సిపల్​ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్​ డిగ్రీ ఉండాలి. అలాగే బీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • పోస్టు గ్రాడ్యుయేట్​ టీచర్​ (PGT) అభ్యర్థులు పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ చేసి ఉండాలి.
  • పోస్టు గ్రాడ్యుయేట్​ టీచర్​ (కంప్యూటర్​ సైన్స్​) అభ్యర్థులు ఎమెస్సీ (కంప్యూటర్​ సైన్స్​/ ఐటీ) లేదా ఎంసీఏ చేసి ఉండాలి.
  • ట్రైన్డ్​ గ్రాడ్యుయేట్​ టీచర్​ పోస్టులకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పాస్ అయ్యుండాలి.
  • ఆర్ట్​ టీచర్ పోస్టులకు ఫైన్​ ఆర్ట్స్​/ క్రాఫ్ట్స్​లో డిగ్రీ చేసి ఉండాలి.
  • మ్యూజిక్​ టీచర్​ పోస్టులకు సంగీతంలో బ్యాచిలర్​ డిగ్రీ​ చేసి ఉండాలి.
  • ఫిజికల్​ ఎడ్యుకేషన్​ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసే​ అభ్యర్థులకు ఫిజికల్​ ఎడ్యుకేషన్​ డిగ్రీ ఉండాలి.

నాన్​-టీచింగ్​ పోస్టులకు సంబంధించి ఆయా విభాగాల వారికి ప్రత్యేక విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

ఎంపిక విధానం
అభ్యర్థులకు ముందుగా పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తరువాత డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ చేసి అభ్యర్థులను షార్ట్​ లిస్ట్​ చేస్తారు.

వయోపరిమితి
ఆయా పోస్టులను అనుసరించి వయోపరిమితి ఉంటుంది. వివిధ కేటగిరీల వారికి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అధికారిక వెబ్​సైట్​లోని నోటిఫికేషన్​ను ముందుగా చదవండి. తరువాత యూజర్ రిజిస్ట్రేషన్​ చేసుకోండి. తరువాత దరఖాస్తు నింపి, డాక్యుమెంట్స్​ అప్​లోడ్​ చేయండి. తరువాత ఫీజు చెల్లించండి. పేమెంట్​ రిసీట్​ను మాత్రం జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకోండి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.