ETV Bharat / bharat

Deaths Across the State Due to Chandrababu Arrest: అధినేత అరెస్టుతో తల్లడిల్లిన అభిమానం.. ఆవేదనతో ఆగిన గుండెలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 9:54 AM IST

13 People Died Across the State Due to Chandrababu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తల్లడిల్లారు. రెండురోజులుగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు ఆందోళనకు గురై గుండెపోటుతో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 13 మంది మృతి చెందారు. అధినేత అరెస్టుతో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

deaths_across_the_state
deaths_across_the_state

Deaths Across the State Due to Chandrababu Arrest: అధినేత అరెస్టుతో తల్లడిల్లిన అభిమానం.. ఆవేదనతో ఆగిన గుండెలు

13 People Died Across the State Due to Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన సమాచారం తెలుసుకొని కార్యకర్తలు తల్లడిల్లిపోయారు. శనివారం మొదలు.. ఆదివారం రోజంతా ఉత్కంఠగా సాగిన కోర్టు తంతుతో శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. కోర్టు పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, విచారణ ప్రక్రియను ప్రసార మాధ్యమాల్లో తెలుసుకుంటూ తీవ్ర ఆందోళన చెంది రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి చెందారు.

Guntur District: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడి శివారు రేగులగడ్డకు చెందిన నల్లజర్ల పెద్ద చెన్నకేశవరావు చంద్రబాబు అరెస్టు వార్త తెలుసుకుని ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. కాసేపటికి కుర్చీలోనే ఒరిగి, అలాగే మృతిచెందారు. చెన్నకేశవరావు టీడీపీ పాలనలో పదేళ్ల పాటు రేగులగడ్డ సంగం డెయిరీ పాలకేంద్రం అధ్యక్షుడిగా, బేతపూడి సొసైటీ డైరెక్టర్‌గా, వార్డు సభ్యుడిగా, టీడీపీ గ్రామ అధ్యక్షుడిగా పని చేశారు.

Live Updates: చంద్రబాబు రిమాండ్ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

Nellore District: నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం టెంకాయచెట్లపాలేనికి చెందిన వాయల సుందరరావు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు.అనంతరం ఇంటికెళ్లి టీవీలో వార్తలు చూస్తూ.. మనస్తాపానికి గురయ్యారు. అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Vizianagaram District: విజయనగరం జిల్లాలో చంద్రబాబు అరెస్టు వార్త విని ఇద్దరు మరణించారు. పట్టణంలోని 23వ డివిజన్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి కోరాడ అప్పారావు చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. తెర్లాం మండలం మోదుగువలసకు చెందిన జి.అప్పారావు శనివారం రాత్రి పొలం నుంచి వచ్చి చంద్రబాబు అరెస్టు వార్తలు విని ఆందోళనకు గురై చనిపోయారు.

Amaravati: అమరావతి మండలం లింగాపురంలో తెలుగుదేశం అభిమాని అభిమాని సరిపూడి కోటేశ్వరరావు చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు.

Nandyala District: నంద్యాల జిల్లా మిడుతూరు మండలం నాగలూటి గ్రామానికి చెందిన చిన్నమాసుం చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందారు.

TDP Leaders Protest Over Remand For CBN: చంద్రబాబు కోర్టు రిమాండ్​పై ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల రాస్తారోకోలు..

Vijayawada: విజయవాడ ఆటోనగర్‌ మెకానిక్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు వేమూరి పార్థసారథి చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.

NTR District: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరానికి చెందిన కుక్కల ప్రకాషరావు చంద్రబాబు వార్త విని మరణించారు.

Ambedkar Konaseema District: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామ టీడీపీ కార్యకర్త జొన్నకూటి రాజు శనివారం రాత్రి గుండెపోటుకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Chittoor District: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త టి.వెంకటేష్‌ ఫోన్‌లో తాజా సమాచారం తెలుసుకుంటూ ఆదివారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Chandrababu Shifted to Central Jail: ఆంక్షల మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు.. తండ్రిని చూసి ఉద్వేగానికి లోనైన లోకేశ్

Palnadu District: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన టీడీపీ క్రియాశీల కార్యకర్త షేక్‌ హుసేన్‌ సాహెబ్‌ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తూ ఆవేదనతో కుప్పకూలిపోయారు.

Krishna District: కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో టీడీపీ సీనియర్‌ నాయకుడు సపవత్తు వాల్యనాయక్‌ గుండెపోటుకు గురై మృతి చెందారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన విశేష సేవలందించారు.

YSR District: వైయస్‌ఆర్‌ జిల్లా రాజుపాళెం మండలం కుమ్మరిపల్లెకు చెందిన పదముత్తం ఏసన్న చంద్రబాబు రిమాండు విషయం తెలుసుకుని అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు.

Prakasam District: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు రైతు నలదల సుబ్బారావు గుండెపోటుతో మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.