ETV Bharat / state

22-09-2026 Telangana News Today Live Updates : రిమ్స్‌ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో 2కు చేరిన మృతుల సంఖ్య

Telangana Live Updates
తెలంగాణ తాజా వార్తలు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 22, 2026 at 6:45 AM IST

|

Updated : September 22, 2026 at 8:18 AM IST

Choose ETV Bharat

22-09-2026 Telangana News Today Live Updates : ఈరోజు తాజా ప్రధాన వార్తల సమాచారం

LIVE FEED

8:17 AM, 22 Sep 2026 (IST)

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. కోల్‌కతా నుంచి రియాద్ వెళుతున్న ఇండిగో విమానంలో ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ గుర్తించిన అధికారులు, స్వాధీనం చేసుకున్నారు. నిందితుని ఎయిర్ పోర్ట్ ఔట్‌ పోస్ట్ పోలీసులకు అప్పగించారు.

8:17 AM, 22 Sep 2026 (IST)

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం, డ్రైవర్‌ మృతి

సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా మోతె వద్ద ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు.

8:14 AM, 22 Sep 2026 (IST)

తిరుమలలో వైభవంగా శ్రీవారి రథోత్సవం

తిరుమలలో శ్రీవారి రథోత్సవం వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో రథాన్ని లాగుతున్నారు. రాత్రి అశ్వ వాహనంతో బ్రహ్మోత్సవ వాహన సేవలు ముగుస్తాయి. రేపు చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

8:12 AM, 22 Sep 2026 (IST)

రిమ్స్‌ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో 2కు చేరిన చిన్నారుల మృతుల సంఖ్య

రిమ్స్‌ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో చిన్నారుల మృతుల సంఖ్య 2కు చేరింది. విద్యుదాఘాతంతో పిల్లల వార్డులో ఏసీ పేలగా, పొగలు దట్టంగా అలుముకుని పలువురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన పిల్లలను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో 25 మంది చిన్నారులు క్షేమంగా ఉన్నారు.

6:47 AM, 22 Sep 2026 (IST)

ఉప్పర్‌పల్లిలో పార్కింగ్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ఉప్పర్‌పల్లిలో పార్కింగ్ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు చూపిస్తూ చంపేస్తామని బెదిరించినట్లు ఇద్దరిపై ఆరోపణలొచ్చాయి. స్థానికుల ఫిర్యాదుతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

6:45 AM, 22 Sep 2026 (IST)

ఆదిలాబాద్‌ అగ్నిప్రమాదంలో చిన్నారి మృతి

ఆదిలాబాద్‌ అగ్నిప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. అగ్నిప్రమాదంలో అస్వస్థతకు గురైన పిల్లలను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో 26 మంది చిన్నారులు క్షేమంగా ఉన్నారు.

6:40 AM, 22 Sep 2026 (IST)

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో పిల్లల వార్డుల్లో ఏసీ పేలింది. పొగలు దట్టంగా అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అస్వస్థతకు గురైన పిల్లలను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.

Last Updated : September 22, 2026 at 8:18 AM IST