ETV Bharat / snippets

ముమ్మరంగా కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌- రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 10:10 AM IST

Updated : May 23, 2024, 1:40 PM IST

police_conducted_cordon_search_operation_state_wide
police_conducted_cordon_search_operation_state_wide (ETV Bharat)

Police Conducted Cordon Search Operation State Wide : కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేసి 14 మంది అనుమానితులను అరెస్ట్‌ చేశామని డీజీపీ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని అనుమానిత ప్రాంతాల్లో ఈ నెల 21 నుంచి 22 వరకు ఎస్పీల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 803 వాహనాలను జప్తు చేశామన్నారు. 310 లీటర్ల అక్రమ మద్యం, 130 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా స్థానిక పోలీసులకు తెలియజేయాలని డీజీపీ సూచించారు.

Last Updated : May 23, 2024, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.