ETV Bharat / snippets

కేంద్ర ఎన్నికల సంఘం చొరవ - ఓటు హక్కు వినియోగించుకున్న దంపతులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 10:07 AM IST

Family Cast Their Vote With Security
Family Cast Their Vote With Security (ETV Bharat)

Family Cast Their Vote With Security : డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ కుటుంబం పోలీసు, రెవెన్యూ అధికారుల బందోబస్తు నడుమ ఓటు హక్కు ఉపయోగించుకుంది. ఈ అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఓ కుటుంబానికి స్థానికులతో రహదారి వివాదం ఉండటంతో ఆ మార్గంలో రాకపోకలకు తమను అనుమతించరని గ్రహించారు. ఓటేసే అవకాశం కోల్పోతామని ఆ కుటుంబసభ్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ఆ వివరాలు జిల్లా కలెక్టరేట్‌కు చేరాయి. విషయం ఎన్నికల పరిశీలకుడి దృష్టికి రావడంతో పోలింగ్‌ రోజున ఓ కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో ఆ దంపతులు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి భద్రపరిచినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.