లైటు వేయలేదని దళితుడిని తిట్టిన ఉప సర్పంచ్​ - బహిరంగ క్షమాపణకు డిమాండ్ - YSRCP Vice Sarpanch Abuse

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 7:12 PM IST

thumbnail

YSRCP Vice Sarpanch Abuse Panchayat workers at Gorantla: నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ప్రగల్భాలు పలికే జగన్మోహన్ రెడ్డి పాలనలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా చేస్తూ, ఉపాధి అవకాశాల్లో దళితులకు అన్యాయం చేస్తున్నదే కాకుండా వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడుతూ కించపరుస్తున్నారు. వైసీపీ ఉపసర్పంచ్ రాజారెడ్డి ఫోన్ చేసి అతని అనుచరుని ఇంటి వద్ద లైట్​ వేయలేదని అసభ్య పదజాలం ఉపయోగించారని మండిపడ్డారు. 

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్ రాజారెడ్డి దళిత గ్రామ పంచాయతీ కార్మికుడిని ఫోన్​లో కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడిన ఆడియో వైరల్​గా మారింది. ఈ విషయంపై గురువారం గ్రామపంచాయతీ కార్మికులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దళితులపై దుర్భాషలాడిన ఉపసర్పంచ్ రాజారెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే రాజారెడ్డి ఇంటిని ముట్టడించి రాజీనామా చేయిస్తామని హెచ్చరించారు. కష్టపడి పనిచేసి జీవిస్తుంటే దళితులను హేళన చేసి మాట్లాడితే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.