ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం: పులివర్తి నాని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 10:25 AM IST

thumbnail

YSRCP Government Not Care People Problems: వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తెలుగుదేశం ఇన్‌ఛార్జి పులివర్తి నాని మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి మనుషులుగా చూడకుండా వారిని కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారని ఆయన విమర్శించారు. దామినేడులోని ఇందిరమ్మ హౌసింగ్‌ కాలనీలో పేరుకుపోయిన చెత్తను కార్యకర్తలతో కలిసి ఆయన శుభ్రపరిచారు. వేలాది మంది ప్రజలు ఆ కాలనీల్లో నివసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో మున్సిపాలిటీ కార్మికులు చెత్తను తొలగించకపోవటంతో భారీగా పేరుకుపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ ప్రాంతం తమ పరిధిలో లేదంటూ చేతులెత్తేశారని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాని దృష్టికి చెత్త సమస్యను తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజలు కార్యకర్తలతో కలిసి ఆ ప్రాంతాన్ని నాని శుభ్రం చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడే పార్టీ వైసీపీనా లేక టీడీపీనా అనేది ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని నాని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.