ప్రభుత్వ కళాశాలలో పరీక్షలు, అక్కడే వైసీపీ కార్యక్రమం- నిరసన తెలిపిన జనసేన కార్యకర్త అరెస్ట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 9:24 PM IST

thumbnail

YSR Aasara Programme in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్​ ఆసరా పంపిణీ కార్యక్రమ సభను ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పరీక్షలు రాయడానికి ఇబ్బంది పడ్డామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నాయకులు విద్యార్థుల ఉజ్వల భవిషత్తుతో చెలగాటం ఆడుతున్నారని జనసేన పార్టీకి చెందిన శివ అనే వ్యక్తి ప్లకార్డుతో నిరసన తెలిపాడు.

Students Who Faced Difficulties Due to Support Program : వైఎస్సార్​ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నిడదవోలు ఎమ్మెల్యే జీ. శ్రీనివాస్​ నాయుడు ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు శివను అరెస్ట్​ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి శివకు సహకరించిన మరొక వ్యక్తిని కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్​ చేశారు. తనని ఎందుకు అరెస్ట్​ చేస్తున్నారో చెప్పమని పోలీసులను శివ ప్రశ్నించారు. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.