వైకేపీ యానిమేటర్లతో వైఎస్సార్సీపీ రహస్య సమావేశం - చర్యలు చేపట్టకుండా వదిలేసిన అధికారులు - YCP leaders meeting with animators

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 10:37 PM IST

thumbnail
వైకేపీ యానిమేటర్లతో వైఎస్సార్సీపీ రహాస్య సమావేశం - చర్యలు చేపట్టకుండా వదిలేసిన అధికారులు (ETV Bharat)

YCP Leaders Arranged Meeting With Animators in Uravakonda : ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో వైఎస్సార్సీపీ నాయకులు చేయని ప్రయత్నం లేదు. ఓటమి భయంతో వైఎస్సార్​సీపీ నేతలు అడ్డదారులు తొక్కతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండలో మహిళా సంఘాలను ప్రలోభాలకు గురిచేసేందుకు వైకేపీ యానిమేటర్లతో మాజీ MPP చంద్రమ్మ ఇంట్లో వైఎస్సార్సీపీ నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ రహస్య సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పీఏ వీరన్న కూడా హాజరై వెళుతున్న దృశ్యాలు టీడీపీ నేతలుకు చిక్కాయి. విషయం తెలుసుకున్న ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్​ను కలసి ఫిర్యాదు చేశాడు. 

ఫిర్యాదు అనంతరం అధికారులు చంద్రమ్మ ఇంటికి చేరుకున్నారు. వారిపై చర్యలు తీసుకోకుండా అధికారులు పట్టీపట్టనట్టుగా వ్యవహరించటం పలు విమర్శలకు తావిస్తోంది. యానిమేటర్ల సమావేశం అధికారులు సహకారంతోనే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉరవకొండలో ఇలాంటి సమావేశాలు నిర్వహించినా చర్యలు చేపట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విపక్షాలు ఆరోపించాయి. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తానని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.