నెల రోజులుగా రాని నీళ్లు - ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 8:53 PM IST

thumbnail

Water Crisis in Dharmavaram For a Month: ఓ వైపు ఎండా కాలం. మరోవైపు మంచినీటి పైప్​లైన్​ మరమ్మతులు. వెరసి ప్రజలకు నీటికష్టాలు మొదలయ్యాయి. ఒక్కరోజో, వారమో కాదు. ఏకంగా నెల రోజుల నుండి ఇబ్బందులు పడుతున్నారు. ఇక విసిగిపోయిన మహిళలంతా నీళ్ల కోసం రోడ్డెక్కారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగింది. జిల్లాలోని వైయస్సార్ కాలనీలో నెల రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని కాలనీకి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా నీటి సమస్యతో విసిగి పోయిన మహిళలు ఖాళీ బిందెలతో ధర్మవరం ప్రధాన రహదారి పైకి చేరుకుని నిరసన (Protest) తెలిపారు.

కాలనీలో పైప్​లైన్ ఏర్పాటు పేరుతో నెల రోజులుగా తాగునీరు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్లతో (Limited Water Supply With Tanker) అరకొర నీటి సరఫరా జరుగుతుందని, ఆ నీరు గృహ అవసరాలకు సరిపోవటం లేదని మహిళలు పేర్కొన్నారు. విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్యాంకర్లతో సరిపడా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.