ఓటరు జాబితాలో ఇంటి నంబర్ల మాయాజాలం - రెండు నంబర్లతో 46 ఓట్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 1:10 PM IST

thumbnail

Voter List Mistakes in Anantapur District : ఓటర్ల తుది జాబితాను పరిశీలించే కొద్ది అందులో ఇంటి నంబర్ల మాయాజాలం కనిపిస్తోంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో రెండు ఇంటి నంబర్లతో ఒకే పోలింగ్‌ బూత్‌లో 46 దొంగ ఓట్లు బయటపడ్డాయి. ఈ ఓటరు జాబితాలో ఒక్క అంకెగల ఇంటి నంబర్లతో మరో 32 దొంగ ఓట్లు నమోదయ్యయి.

పాల్తూరులోని పోలింగు కేంద్రంలో 40లో మొత్తం 1246 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కేంద్రంలోని వరస సంఖ్య 4, 26, 27, 28, 29, 34, 35, 36, 38, 41, 42, 43, 44, 45,53,54,58,59,60,62,63,64,65,66,68,69 లలో ఉన్న ఓటర్లతో పాటు మరింత మంది ఇంటి నంబర్లు 1-1తో  నమోదయ్యాయి. వారంతా ఏకంగా 32 మంది ఓటర్లు ఉన్నారు. రెండు ఇంటి నంబర్లతో ఒకే పోలింగు కేంద్రంలో 46 మంది ఓటర్లు ఉండడం విశేషం. ఓటరు జాబితాలో సింగిల్​ డిజిట్టుతో ఇంటి నంబర్లు నమోదు కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా సింగిల్​ డిజిట్లు ఇంటి నంబర్లు ఉండవు. ఇదే ఓటరు జాబితాలో ఇంటి నంబరు 1-18తో 14 ఓట్లు నమోదు అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.