ఈదురు గాలులకు కారుపై విరిగిపడిన చెట్టు - ఇద్దరికి గాయాలు - Tree Falls on Car in Srikakulam

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 9:55 PM IST

thumbnail
ఈదురు గాలులకు కారుపై విరిగిపడిన చెట్టు - ఇద్దరికి గాయాలు (ETV Bharat)

Tree Falls on Car in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ప్రమాదంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈదురు గాలులకు ఒక్కసారిగా కారుపై చెట్టు విరిగిపడింది. అయితే ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటిలో శనివారం సాయంత్రం చిరుజల్లులతో కూడిన ఈదురు గాలులు వీచాయి. ఆ సమయంలో కవిటి అశోక థియేటర్ సమీపంలో అటుగా వెళుతున్న కారుపై చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరి వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

వివరాల్లోకి వెళితే నెలవంక పంచాయతీ దుర్గం పుట్టుక గ్రామానికి చెందిన దుర్గాసి దిలీప్ రెడ్డి, అతని స్నేహితులు కలిసి కవిటి నుంచి ఈదుపురం వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొద్ది నెలలుగా ఆ చెట్టు ఎండిపోయిందని, ఏ క్షణమైనా నేలకొరిగే ప్రమాదం ఉందని అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. కారు నెమ్మదిగా నడుపుతుండడంతో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. దీంతో అక్కడ వారు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.