రాజకీయ లబ్ధి కోసమే ఈసీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం: అనగాని - Anagani on Pension Distribution

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 1:51 PM IST

thumbnail

TDP MLA Anagani on Pension Distribution : రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్సీపీ ఎన్నికల సంఘంపై దుష్ప్రచారానికి దిగుతోందని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. సంక్షేమ పథకాలు వాలంటీర్ల (Volunteer) ద్వారా పంపిణీ చేయొద్దు అని ఈసీ చెప్పిందని, పథకాలు ఆపమని చెప్పలేదన్నారు. ఈసీ మీద వంకతో ఈ నెల ఫించన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టి వృద్ధుల నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ రెడ్డి కుట్ర అని ధ్వజమెత్తారు. ఒక్క ఫించన్ కూడా ఆగనివ్వమన్న అనగాని, చివరి లబ్ధిదారునికి పింఛన్ ఇచ్చే వరకు వైఎస్సార్సీపీని (YSRCP) వదిలిపెట్టమని హెచ్చరించారు. 

YSRCP Pension skipping : జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పెన్షన్ల పంపిణీ (Distribution of pensions) బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించిందని మండిపడ్డారు. గత ఐదేళ్లలో 6 లక్షల పెన్షన్లను తగ్గించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవ్వ, తాతల ఉసురు తీసిందని మండిపడ్డారు. ప్రజలు రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దుష్ప్రచారాన్ని ఓటుతో బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.