పులివెందులలోనూ జగన్​కు ఓటమి భయం- అసంతృప్తి కార్యకర్తలకు భారీగా నగదు పంపిణీ: పత్తిపాటి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 6:28 PM IST

thumbnail

TDP Leader Pathipati Pulla Rao Fires On YS Jagan : జగన్ ఓటమి భయంతో పులివెందులలో వైఎస్సార్సీపీ అసంతృప్తి కార్యకర్తలకు రూ. 10లక్షల వరకు పంపిణీ చేయించారని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. జగన్ అవినీతి సొత్తుతో ఎన్నికల ఫలితాన్ని మార్చలేరని పత్తిపాటి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీని శాశ్వతంగా పాతిపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం - జనసేన సీట్లపై ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్​  దీనిపై స్పష్టత ఇస్తారని పత్తిపాటి పుల్లారావు తెలిపారు.  

Pathipati Comments on Jaganmohan reddy :  వైనాట్​ 175 అంటూ జగన్మోహన్​రెడ్డి మేకబింకం ప్రదర్శిస్తున్నారు కానీ సొంత నియోజక వర్గంలో కూడా గెలుస్తామన్న నమ్మకం లేకుండా ఉన్నారని పత్తిపాటి ధ్వజమెత్తారు. చీప్​ లిక్కర్​, అక్రమ మద్యం, సాండ్​, ల్యాండ్​, మైనింగ్​ పేరిట దోచుకున్న యథేచ్ఛగా దోచుకున్న ధనాన్ని కార్యకర్తలకు పంచుతున్నాడని విమర్శించారు. ప్రజలు వైఎస్సార్సీపీని  పాతిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.