LIVE: టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం- ప్రత్యక్షప్రసారం - Chandrababu media conference

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 3:40 PM IST

Updated : Apr 9, 2024, 4:21 PM IST

thumbnail

TDP chief Chandrababu media conference Live: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాదిని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. క్రోధి నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నామని, క్రోధి అంటే కోపంతో ఉన్నవారు, ఆగ్రహం ధర్మాగ్రహం కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలని కోరుకుందామన్నారు. ఈ ఉగాది, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని అందించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా శుభాలు కలగాలని పేర్కొన్నారు. న‌వ‌ వ‌సంతం అంద‌రికీ ఆయురారోగ్యాలు, స‌క‌ల శుభాలు చేకూర్చాలని ఆయన అభిలాశించారు. ఉగాది తెచ్చిన ఉత్తేజంతో రాష్ట్ర ప్రగ‌తికి, ప్రజా సంక్షేమానికి పాటుప‌డ‌దాం అంటూ పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : Apr 9, 2024, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.