టీడీపీ-జనసేన మొదటి జాబితాకి తాడేపల్లి ప్యాలెస్ కంపించింది: బోండా ఉమా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 10:39 PM IST

thumbnail

TDP Bonda Uma Fires on CM Jagan: తెలుగుదేశం-జనసేన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిందని, తుది జాబితాతో వైసీపీ మైండ్ బ్లాంక్ తప్పదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. టీడీపీ-జనసేన 118 స్థానాలు ఒకేసారి ప్రకటించిందిన్నారు. అంతా సాఫీగా జరిగిందని, వైసీపీలాగా కుదుపులేమీ లేవని వెల్లడించారు. 80 సీట్లు ప్రకటించడానికే వైసీపీ కల్లోలమై అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జారిపోయారని తెలిపారు. జగన్ ఫ్రస్టేషన్​లో ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనతో వైసీపీ అగ్రనేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. దీంతో సజ్జల తెరమీదకు వచ్చి అవాకులు చవాకులు పేలారని మండిపడ్డారు. 

పవన్ కల్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల, జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందు చెప్పాలని ప్రశ్నించారు. మా పొత్తులు, మా సీట్ల గురించి ఓవర్​గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా అని ధ్వజమెత్తారు. ఎగిరెగిరి పడుతున్న అంబటి రాంబాబుకు అసలు సీటు ఉందో లేదో చెప్పాలన్నారు. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు. మళ్లీ టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడతారా అని దుయ్యబట్టారు. జగన్​ను నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండని, తాను చేసిన తప్పులకు బదిలీలు అని ఇప్పటికే 77 మందిని బలి చేశారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఘన విజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు స్వస్తి పలకడం ఖాయమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.