శ్రీవారి సేవలో తారాకరత్న తండ్రి- కుమారుడి తొలి వర్ధంతి రోజున అన్నదాన కార్యక్రమం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 10:10 PM IST

thumbnail

Taraka Ratna Father in Tirumala Temple : తిరుమల శ్రీవారిని తారకరత్న తండ్రి నందమూరి మోహన్‌కృష్ణ, సోదరి మోహన రూప దర్శించుకున్నారు. వీఐపీ దర్శనం సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం మోహన్​కృష్ణ మాట్లాడుతూ, తారకరత్న మరణించి నేటికి ఏడాది పూర్తి అవుతుందని వెల్లడించారు. తారకరత్న తమ మధ్య లేకపోవడం చాలా విచారకరంగా ఉందన్నారు. తారకరత్నపై అటు దేవుడి ఆశీస్సులు నాన్నాగారి ఆశీస్సులు ఉంటాయన్నారు. 

1985 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే స్ఫుర్తితో తారకరత్న పేరుతో మధ్యహ్నం ఒక పూట భక్తులకు భోజనం కల్పిస్తామన్నారు. దానికి కావలసిన రూ. 15 లక్షల విరాళాన్ని తితిదే అధికారులకు అందజేశామని తెలిపారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనంలో భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలు వడ్డించారు. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో పాదయాత్ర చేస్తుండగా తారకరత్నకు ఒక్కసారి తీవ్రమైన గుండెపోటు వచ్చి మరణించిన విషయం తెలిసిందే. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.