చిత్ర లేఅవుట్‌లో ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సం - Sri Rama Navami Celebrations

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 7:50 PM IST

thumbnail

Sri Rama Navami Celebrations in Chitra Layout : శ్రీరామనవమి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. అందులో భాగంగా నగరంలో ఎల్బీనగర్ పరిధిలోని చిత్ర లేఅవుట్‌లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవాళ జరిగిన సీతారాముల వివాహ వేడుకను భక్తులు కనులారా వీక్షించి, తన్మయత్వం పొందారు. ఏటా కాలనీ వాసులమంతా కుల, మతాలకు అతీతంగా కల్యాణోత్సవం జరుపుకుంటామని అసోసియేషన్‌ అధ్యక్షులు పెండ్యాల నాగేశ్​ అన్నారు.  

seetharamula kalyanam in chitra layout : సీతారాముల కల్యాణాన్ని ఆదర్శంగా తీసుకుని జీవనం కొనసాగించాలని పెండ్యాల నాగేశ్​ అన్నారు. శ్రీరామ అని నోరార పలికితే సకల పాపాలు తొలిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయని చెప్పారు. ప్రతి ఏటా శ్రీరామనవమి నిర్వహించడం పుణ్యంగా భావిస్తామని తెలిపారు. శ్రీరామనవిమి సందర్భంగా సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు నేర్పిస్తూ రాముణ్ని ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున కాలనీవాసులు హాజరై భక్తిశ్రద్ధలతో తిలకించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.