దర్గాలో దశరథ తనయుని కల్యాణం - రేపటి పట్టాభిషేకంలో మరో ప్రత్యేకత! - Sitarama Kalyanam in Dargah

By ETV Bharat Telangana Team

Published : Apr 17, 2024, 6:36 PM IST

thumbnail

Sitarama Kalyana Mahotsavam in Dargah : సాధారణంగా సీతారాముల కల్యాణం ఆలయాల్లోనో లేదంటే ఊళ్లోని గ్రామపంచాయతీలోనూ జరుపుకుంటారు. ఇక్కడ మాత్రం గత 60 ఏళ్లుగా దర్గాలో రాములవారి కల్యాణం నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కులమతాలకు అతీతంగా దర్గాలో రాములోరికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ, 20 ఏళ్లుగా ఉర్సు మహోత్సవాలు ఘనంగా చేస్తున్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. అదేవిధంగా శ్రీరాముని కల్యాణానికి దమ్మక్క వంశీయులు స్థానిక గిరిజనులు సంప్రదాయ రీతిలో స్వామివారికి కల్యాణ సామాగ్రి తీసుకువస్తుంటారు.

Muslims Celebrate Rama Navami In Dargah : 2021లో శ్రీరాముని పట్టాభిషేకం కోసం ఓ భక్తుడు ప్రత్యేకంగా చేయించిన శ్రీ సీతారాముల లక్ష్మణ సమేత హనుమాన్ పంచలోహ విగ్రహాలను, నాటి నుంచి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో శ్రీరామనవమి మరుసటి రోజు అయోధ్య, భద్రాచలం తీరున పట్టాభిషేకం వేడుక జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ దృశ్యం చూసినవారంతా పరమతసహనానికి అద్దం పడుతుందని కొనియాడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.