వైభవంగా సింహాద్రి అప్పన్న కల్యాణోత్సవం -రంగులు జల్లుకుంటూ వేడుకలో పాల్గొన్న భక్తులు - Simhadri Appanna Kalyanam utsavam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 4:56 PM IST

thumbnail

Simhadri Appanna Kalyanam in Simhachalam Visakhapatnam : విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. ప్రసిద్ధ వరాహా నరసింహా స్వామి వారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర గంగాధర వద్ద చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారిని ఆలయంలోని బేడా మండపం చూట్టూ తిరువీధి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పుష్కరిణి ప్రాంగణంలో పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే భక్తులు కళ్యాణ మహోత్సవంలో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొంటూ ఉత్సహంగా వేడుకలో పాల్గొన్నారు. 

Appanna Swamy Kalyana Celebrations : రేపు( బుధవారం) ఆలయంలో వినోద్ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలు రద్దు చేశారు. ఆలయ అర్చకులు యాగశాల వద్ద శాంతి హోమాన్ని వైభవంగా జరుపుతున్నారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.