చెన్నై షాపింగ్ మాల్​ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

By ETV Bharat Telangana Desk

Published : Feb 5, 2024, 3:35 PM IST

thumbnail

Shopping Mall Sweeper Suicide in Kukatpally : కూకట్‌పల్లి వై జంక్షన్​లో గల ఓ షాపింగ్ మాల్​ పైనుంచి దూకి మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం మృతురాలు రమణమ్మ(50), గత ఐదు సంవత్సరాలుగా చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్​లో హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పని చేస్తుంది. రోజులాగే ఉదయం విధులకు హాజరైన రమణమ్మ, తాను పని చేయాల్సిన రెండో అంతస్తులో కాకుండా, బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.

Women Suicide Case : ఆత్మహత్యకు పాల్పడే ముందు రమణమ్మ, తాను పని చేసే చోట కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారంటూ, కుమారుడికి ఆడియో సందేశం పంపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఆత్మహత్యకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు షాపింగ్‌ మాల్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.