కూటమి అభ్యర్థులకు మద్దతుగా సినీనటుడు షకలక శంకర్‌ ప్రచారం - shakalaka shankar campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 11:29 AM IST

thumbnail
కూటమి అభ్యర్థులకు మద్దతుగా సినీనటుడు షకలక శంకర్‌ ప్రచారం (ETV Bharat)

Shakalaka Shankar Campaign in Srikakulam: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో భాగంగా అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థుల తరపున ఓటు వేయాలంటూ ర్యాలీలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తరఫున​, కూటమి నేతల తరఫున ఇప్పటికే పలువురు సినీ తారలు, బుల్లితెర నటులు ప్రచారం చేస్తున్నారు. హైపర్‌ ఆది, గెటప్‌ సీను, డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ తదితరులు ప్రచారంలో పవన్‌కు మద్దతుగా విస్తృతంగా పాల్గొంటున్నారు. 

తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా సినీ నటుడు షకలక శంకర్‌ ప్రచారం నిర్వహించారు. రణస్థలం మండలంలోని మరువాడ, పతివాడపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని షకలక శంకర్ కోరారు. పవన్‌ కల్యాణ్‌ పాటలకు డ్యాన్స్‌ చేస్తూ ఓటర్లను ఉత్సాహపరిచారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.