పంచాయతీ నిధులు నిర్వీర్యం చేసిన సీఎం జగన్​- ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 4:15 PM IST

thumbnail

Sarpanches Protest at Collectorate in Srikakulam District : పంచాయతీలకు నిధులకు ఇవ్వకుండా వాటి నిర్వీర్యం చేసిన సీఎం జగన్​ను రానున్న ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్​ ఛాంబర్​ అధ్యక్షుడు బాబు రాజేంద్రప్రసాద్​ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం కలెక్టరేట్​ వద్ద ఉమ్మడి జిల్లా సర్పంచ్​లు ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్​లోకి వెళ్లేందుకు యత్నించిన సర్పంచ్​లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సర్పంచ్​ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్​లు కలెక్టరేటు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. పోలీసులు కలెక్టర్​ను కలిసేందుకు అనుమతించాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తుందని బాబు రాజేంద్రప్రసాద్​ మండిపడ్డారు. రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్​ల 16 న్యాయబద్ధమైన డిమాండ్​లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజలు అందరూ సీఎం జగన్​ను ఓడించడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.