వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల అత్యుత్సాహం - అర్థరాత్రి రోడ్డు డివైడర్‌ తొలగింపు - Divider Removed for Jagan Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 10:20 AM IST

thumbnail
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల అత్యుత్సాహం - అర్థరాత్రి రోడ్డు డివైడర్‌ తొలగింపు (ETV Bharat)

Divider Removed for CM Jagan Meeting: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా చెట్లను కూల్చడం, నిర్మాణాలను ధ్వంసం చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. నేడు నరసాపురంలో సీఎం జగన్‌ (YS Jagan Mohan Reddy) బహిరంగ సభ జరగనుంది. అయితే సభ ఏర్పాట్లలో భాగంగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై డివైడర్‌ను తొలిగించారు. 

గురువారం అర్ధరాత్రి పురపాలక సిబ్బంది పొక్లెయిన్‌తో డివైడర్‌ను తొలగించారు. ఆ పనులను వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పర్యవేక్షించారు. తొలగించిన కాంక్రీటు రద్దు బయటకు తరలించేందుకు మున్సిపాలిటీ ట్రాక్టర్లను వినియోగించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు రోడ్డుపై డివైడర్‌ను తొలగించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ఇదే ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సదస్సుకు లేని అడ్డు అధికార పార్టీ నాయకులకు ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా సీఎం జగన్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ పట్టణంలో చెట్లను చాలా వరకూ కొట్టేశారని ప్రజాసంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.