'అక్రమంగా నగదు తరలింపు- స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు'

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 21, 2024, 2:38 PM IST

thumbnail

Railway Police Seize The Money Being Smuggled: కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న కోటి 95 వేల రూపాయలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలులో హైదరాబాద్‌ నుంచి ఆదోనికి వెళ్తున్న మొహమ్మద్‌ అనే వ్యక్తి బ్యాగును రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదును ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని రైల్వే పోలీసులు తెలిపారు.

అదే విధంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో విధుల్లో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టేందుకు 24 గంటలపాటు ప్రతి వాహనాన్ని తనిఖీ  చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. కాంత్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. శనివారం కర్నూలు మండల పరిధిలోని ప౦చలింగాల చెక్​పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్​పోస్టులో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సిబ్బంది సంఖ్య పెంచాలని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా మరింతగా నిఘా పెంచాలని ఎస్పీ పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.